పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
మే 28తో ముగియాల్సిన గడువును మరో రెండు రోజులు గడువు పెంచారు. విద్యార్థులు సద్వినియోగ పరచుకునేలా తల్లిదండ్రులకు అవగాహన పరచాలని ఆర్జేడీలకు, డీఈవోలకు కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్12(1) (ఈ) ప్రకారా 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు 1వ తరగతిలో ఎంపికైన విద్యార్థులు బడిలో చేరేందుకు గడువును మే 30 వరకు పొడిగించినట్లు పాఠశాల విద్య కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ మే 28న ఒక ప్రకటనలో తెలిపారు.
వాస్తవానికి మే 28తో ముగియాల్సిన గడువును విద్యార్థుల సౌకర్యార్థం మరో రెండు రోజులు గడువు పెంచినట్లు, విద్యార్థులు సద్వినియోగ పరచుకునేలా తల్లిదండ్రులకు అవగాహన పరచాలని ఆర్జేడీలకు, డీఈవోలకు కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఎంపికైన పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఇందులో అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Also Read:
బాసర ట్రిపుల్ ఐటీ షెడ్యూల్ విడుదల, జూన్ 5 నుంచి దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలు విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ బుధవారం (మే 24) షెడ్యూలును ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 1న నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్ కేటగిరీ కింద పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ తదితర విద్యార్థులు జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 26న మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. జులై 1న ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి. పదోతరగతిలో వచ్చే మార్కుల (జీపీఏ) ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ తెలిపారు. 18 సంవత్సరాలు మించిన విద్యార్థులకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీలోని 85 శాతం సీట్లు లోకల్ వాళ్లకు, మిగిలిన 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీకి వర్తిస్తాయన్నారు. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు అవసరమయ్యే కుల, ఆదాయ ధృవపత్రాల జారీలో ఆలస్యం చేయొద్దని ఆయన అధికారులకు సూచించారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్ పెంచిన సర్కార్ - ఎంత శాతమంటే?
తెలంగాణలోని వైద్య కళాశాల్లో చదువుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లోమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్పులు చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెరగనుంది. అలాగే సీనియర్ రెసిడెంట్లకు హానరోరియం కూడా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పీజీ వైద్య విద్యార్థులకు ఇచ్చే స్టైపెండ్‌ను 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచే ఇది వర్తించనుంది. సీఎం కేసీఆర్ గతంలోనే వైద్య విద్యార్థులకు స్టైపెండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆర్థిక శాఖ అనుమతితో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ శనివారం (మే 27) జీవో జారీ చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..