By: ABP Desam | Updated at : 24 May 2023 10:32 PM (IST)
Edited By: omeprakash
బాసర ఐఐటీ ప్రవేశ షెడ్యూలు
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలు విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ బుధవారం (మే 24) షెడ్యూలును ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 1న నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్ కేటగిరీ కింద పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ తదితర విద్యార్థులు జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 26న మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. జులై 1న ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి.
పదోతరగతిలో వచ్చే మార్కుల (జీపీఏ) ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ తెలిపారు. 18 సంవత్సరాలు మించిన విద్యార్థులకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీలోని 85 శాతం సీట్లు లోకల్ వాళ్లకు, మిగిలిన 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీకి వర్తిస్తాయన్నారు. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు అవసరమయ్యే కుల, ఆదాయ ధృవపత్రాల జారీలో ఆలస్యం చేయొద్దని ఆయన అధికారులకు సూచించారు. ఈమేరకు సంబంధిత ఉన్నతాధికారులకు ఆయన లేఖను కూడా రాయనున్నట్లు తెలిపారు.
వర్సిటీకి త్వరలో ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జూన్ 20న వర్సిటీ ఓపెన్ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెమిస్టర్ విధానాన్ని ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వెనుకబడిన విద్యార్థులు, కొంత మంది అమ్మాయిలు చదువు మధ్యలో డ్రాపౌట్ అవుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
నిజామాబాద్‌లో ఏర్పాటు చేసే ఐటీ టవర్స్‌లో విద్యార్థులు చేసే నూతన ఆవిష్కరణలతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వివరించారు. నిర్మల్ హబ్, వర్సిటీలో ఐటీ గర్ల్స్ ల్యాబ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. విదేశీ వర్సిటీలను బాసర వర్సిటీకి తీసుకొచ్చి సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలతో అమెరికా నుంచి ప్రతీ శని, ఆదివారాల్లో విద్యార్థులకు ప్రత్యేక ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అడ్వాన్స్‌డ్ కిచన్ ఏర్పాటు..
వర్సిటీలోని తొమ్మిది వేల మంది విద్యార్థులకు సరిపడా అడ్వాన్స్‌డ్ కిచన్ ఏర్పాటుకు సంబంధించి జూన్ 1న టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు, దీనికి సంబంధించి అక్షయపాత్ర, ఇతర సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతీ వారంలో ఒకరోజు విద్యార్థులకు పెట్టే మాసాంహార భోజనాన్ని ఆ ప్రాంతంలో ఉండే మహిళా సంఘాలకు క్యాటరింగ్ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
Also Read:
టీఎస్ పీజీఈసెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
తెలంగాణలో పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్)-2023 హాల్‌టికెట్లను జేఎన్‌టీయూ హైదరాబాద్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది, పరీక్ష పేపర్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు పీజీఈసెట్ దరఖాస్తు గడువు రూ.2500 ఆలస్య రుసుముతో మే 24తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!
ICAR: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ)-2023 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
IIIT Hyderabad: హెచ్ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్, ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌లో ప్రవేశాలు!
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?