పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్ పెంచిన సర్కార్ - ఎంత శాతమంటే?
తెలంగాణలోని వైద్య కళాశాల్లో చదువుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లోమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్పులు చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెరగనుంది.
తెలంగాణలోని వైద్య కళాశాల్లో చదువుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లోమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్పులు చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెరగనుంది. అలాగే సీనియర్ రెసిడెంట్లకు హానరోరియం కూడా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పీజీ వైద్య విద్యార్థులకు ఇచ్చే స్టైపెండ్‌ను 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచే ఇది వర్తించనుంది. సీఎం కేసీఆర్ గతంలోనే వైద్య విద్యార్థులకు స్టైపెండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆర్థిక శాఖ అనుమతితో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ శనివారం (మే 27) జీవో జారీ చేశారు.
ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేసి వివిధ బోధనాస్పత్రుల్లో హౌజ్‌సర్జన్, డెంటల్ హౌజ్‌సర్జన్లుగా పనిచేస్తున్న వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.22,527 ఇస్తుండగా, దాన్ని రూ.25,906కు పెంచారు. ఇక పీజీ ఫస్టియర్ విద్యార్థులకు 50,385 నుంచి 58,289, సెకండియర్ విద్యార్థులకు 53,503 నుంచి 61,528, థర్డ్ ఇయర్ విద్యార్థులకు 56,319 నుంచి 64,767కి స్టైపెండ్ పెరగనుంది. తమకు గౌరవ వేతనం పెంచడంపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
పెంచిన స్టైపెండ్ ఇలా..
మెడికో | ప్రస్తుతం | పెంచిన తర్వాత |
హౌస్ సర్జన్ మెడికల్/డెంటల్ | రూ.22, 527 | రూ.25, 906 |
పీజీ డిగ్రీ- ఫస్టియర్ | రూ.50,686 | రూ.58,289 |
పీజీ డిగ్రీ- సెకండియర్ | రూ.53,503 | రూ.61,528 |
పీజీ డిగ్రీ- థర్డ్ఇయర్ | రూ.56,319 | రూ.64,767 |
పీజీ డిప్లొమా- ఫస్టియర్ | రూ.50,686 | రూ.58,289 |
పీజీ డిప్లొమా- సెకండియర్ | రూ. 53,503 | రూ.61,528 |
సూపర్ స్పెషాలిటీ - ఫస్టియర్ | రూ.80,500 | రూ.92,575 |
సూపర్ స్పెషాలిటీ - సెకండియర్ | రూ.84,525 | రూ.97,204 |
సూపర్ స్పెషాలిటీ - థర్డ్ఇయర్ | రూ.88,547 | రూ.1,01,829 |
ఎండీఎస్-ఫస్టియర్ | రూ.50,686 | రూ.58,289 |
ఎండీఎస్-సెకండియర్ | రూ.53,503 | రూ.61,528 |
ఎండీఎస్-థర్డ్ ఇయర్ | రూ.56,319 | రూ.64,767 |
సీనియర్ రెసిడెంట్స్ | రూ.80,500 | రూ.92,575 |
Also Read:
నిట్ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు క్యాట్ లేదా మ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్/ మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 19 వరకు అవకాశం ఉంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
నిట్ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, విభాగాలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు గేట్/ క్యాట్/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్/ ఇన్‌స్పైర్/ నెట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలు గల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. విల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ప్రవేశాలు ఉంటాయి.
ప్రోగ్రామ్ వివరాల కోసం క్లిక్ చేయండి..