Top 10 Headlines Today: వైఎస్‌ఆర్‌సీపీకి పవన్ న్యూ ఛాలెంజ్, ధరణిపై కాంగ్రెస్ మాట బీజేపీ నోట, ఆదిపురుష్‌పై సెహ్వాగ్ సెటైర్లు
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
పవన్ క్లారిటీ
2024లో వైసీపీ ప్రభుత్వం పోతుంది.. ఒక్క సీటుకూడా గెలవకుండా బాధ్యత తనదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమను టూరిస్ట్ జోన్‌గా అభివృద్ధి చేస్తాం.. ఆధ్మాత్మిక టూరిజాన్ని నెలకొల్పుతామని చెప్పారు. ఇసుకను దోచుకున్న డబ్బును మళ్లీ ఓట్లుకోసం కేటాయిస్తారేమో.. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి గుండిపోటు అని నమ్మబలికారు అని మలికిపురం బహిరంగ సభలో పవన్ ప్రస్తావించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రైతులకు గుడ్ న్యూస్
తెలంగాణలో అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు సోమవారం నుంచి జమచేయనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. జూన్ 26వ తేదీ నుంచి రైతుబంధు నగదును అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ధరణి రద్దు
ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనతో అన్ని వర్గాల వారికి న్యాయం చేశామని, దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చి సహకరించామని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని వారికి నివాళి అర్పించారు. కానీ ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ది పొందిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనతో తెలంగాణ సామర్థ్యం నాశనం అయిందంటూ మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. బీఆర్ఎస్ నేతల జేబులు నింపుతున్న ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణలో జోరువానలు
తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాత్తి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వెనక్కి తగ్గిన అనిల్
రాజీనామా విషయంలో ఆనం రామనారాయణ రెడ్డి నుంచి ఊహించని సవాల్ ఎదురవడంతో ఎమ్మెల్యే అనిల్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే వెంటనే ఎన్నికలొస్తాయని, ఫలితాలు వచ్చిన మూడు నెలల్లోనే మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశముందని, అందుకే ఇప్పుడు రాజీనామాలు వద్దని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తలపడతామని ఆనంకు అనిల్ బదులిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీనుంచి తాను బరిలో దిగుతానని, టీడీపీ తరపున ఆనం బరిలో దిగితే ఆయన్ను ఓడిస్తానన్నారు. అలా జరక్కపోతే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు అనిల్. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
50 ఏళ్ల తర్వాత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ రోజురోజుకూ ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుగా మారుతోంది. లోక నాయకుడు ‘కమల్ హాసన్’ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించకపోయినా కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ‘ప్రాజెక్ట్ కే’లో చేయడంపై కమల్ హాసన్ కూడా స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సురేఖావాణి రిక్వస్ట్
ముందు 'బిగ్ బాస్' అషు రెడ్డి, ఆ తర్వాత నటి జ్యోతి... ఇప్పుడు సురేఖా వాణి (Surekha Vani)! ఒక్కొక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. డ్రగ్స్ కేసుతో తమకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. సురేఖా వాణి సైతం ఓ వీడియో విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సెహ్వాగ్ సెటైర్లు
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్’ చిత్రం అభిమానులను అలరించడంలో విఫలం అయ్యింది. రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని భావించారు. కానీ, ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొంటుంది. పలువురు ఈ సినిమాపై విమర్శలు చేశారు. డైలాగ్స్ నుంచి వీఎఫ్‌ఎక్స్ వరకు అన్నింటిపైనా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. తాజాగా ఈ సినిమాపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ రేంజిలో సెటైర్లు విసిరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రెండు పెట్టుబడి పథకాలు
ఈ సంవత్సరం సంపాదించిన ఒక రూపాయి విలువ వచ్చే ఏడాదికి 90 పైసలకు పడిపోతుంది. కారణం ద్రవ్యోల్బణం. ప్రస్తుతం దీనిపై చాలామంది అవగాహన పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొనే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని స్కీముల్లో పెట్టుబడి పెడుతున్నారు. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండి, ఆమె భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే, బాగా ప్రజాదరణ పొందిన రెండు పెట్టుబడి పథకాలు ఉన్నాయి. అవి.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY). వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సక్సెస్ అయినా నో సేల్
టయోటా కిర్లోస్కర్ మోటార్ 2022 ద్వితీయార్ధంలో భారతదేశంలో దాని మిడ్ రేంజ్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కారును లాంచ్ చేసిన నాటి నుండి ప్రజలు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు. మొదట్లో ఈ కారుకు సంబంధించి అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు వినియోగదారులు దాని డెలివరీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి