search
×

SSY vs PPF: సుకన్య vs పీపీఎఫ్‌లో.. మీ పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్‌!!

PPF vs SSY: మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండి, ఆమె భవిష్యత్‌ కోసం ఇప్పటి నుంచే మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే, బాగా ప్రజాదరణ పొందిన రెండు పెట్టుబడి పథకాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

PPF vs SSY:

ఈ సంవత్సరం సంపాదించిన ఒక రూపాయి విలువ వచ్చే ఏడాదికి 90 పైసలకు పడిపోతుంది. కారణం ద్రవ్యోల్బణం. ప్రస్తుతం దీనిపై చాలామంది అవగాహన పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొనే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని స్కీముల్లో పెట్టుబడి పెడుతున్నారు. మీ ఇంట్లో  ఒక ఆడపిల్ల ఉండి, ఆమె భవిష్యత్‌ కోసం ఇప్పటి నుంచే మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే, బాగా ప్రజాదరణ పొందిన రెండు పెట్టుబడి పథకాలు ఉన్నాయి. అవి.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY). వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు.

ఎస్‌ఎస్‌వై, పీపీఎఫ్‌లో ఎవరెవరు పెట్టుబడి పెట్టవచ్చు?

10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం మాత్రమే సుకన్య సమృద్ధి యోజనను (sukanya samriddhi yojana) ప్రత్యేకంగా ప్రారంభించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఆడపిల్లకు 21 ఏళ్లు నిండిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. దీనికి విరుద్ధంగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (public provident fund) పథకంలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం కూడా PPF ఖాతా తెరవవచ్చు.

ఎస్‌ఎస్‌వై, పీపీఎఫ్‌ స్కీమ్‌లలో లాక్-ఇన్ పిరియడ్ ఎంత?

సుకన్య సమృద్ధి యోజన కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడపిల్లల కోసం ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ట పరిమితి 21 సంవత్సరాలు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం గురించి చెప్పుకుంటే, దీనిలో మొత్తం పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు. ఆడపిల్లకు 18 ఏళ్ల వయస్సు వచ్చేంతవరకే SSY ఖాతాలో పెట్టుబడి పెట్టడం సాధ్యం అవుతుంది, ఆ తర్వాత డబ్బు జమ చేయలేరు. PPF ఖాతాలో పెట్టుబడి వ్యవధిని 15 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ గడువు పూర్తయిన తర్వాత మరో 5 సంవత్సరాల వరకు పొడిగించుకుని, పెట్టుబడిని కొనసాగించవచ్చు.

ఎస్‌ఎస్‌వై, పీపీఎఫ్‌ పథకాల్లో గరిష్ఠ పెట్టుబడి ఎంత?

సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ రెండు పథకాల కింద పోస్టాఫీసు లేదా బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.

ఎస్‌ఎస్‌వై, పీపీఎఫ్‌లో ఎంత వడ్డీ వస్తుంది?

సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడితే, ఆ డబ్బుపై 8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు బదిలీ చేస్తారు. పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. కాబట్టి, మీరు ఈ రెండింటిలో ఏదైనా ఒక స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, సుకన్య సమృద్ధి యోజన మెరుగైన పథకం అని, ముఖ్యంగా ఆడపిల్లల కోసం మంచి పథకంగా చెప్పుకోవచ్చు. 

SSY ఖాతాలో జమ చేసిన డబ్బును ఆడపిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పాక్షికంగా, 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. PPF ఖాతా విషయానికి వస్తే, పెట్టుబడి పెట్టిన మొత్తంలో ఏడు సంవత్సరం తర్వాత కొంతమొత్తాన్ని విత్‌డ్రా చేయవచ్చు.

Published at : 25 Jun 2023 06:56 PM (IST) Tags: Public Provident Fund govt schemes SSY vs PPF sukanya smariddhi yojana

ఇవి కూడా చూడండి

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది

Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది

PPF vs FD : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?

PPF vs FD : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?

పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం

పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం

టాప్ స్టోరీస్

CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి

Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్

Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్

ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు

ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు

Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది

Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది