Pawan Kalyan: అంబేడ్కర్ కంటే ఏపీ సీఎం గొప్పోడా, పథకానికి జగన్ పేరు పెట్టుకోవడంపై పవన్ కళ్యాణ్ సెటైర్లు!
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమను టూరిస్ట్ జోన్‌గా అభివృద్ధి చేస్తాం.. ఆధ్మాత్మిక టూరిజాన్ని నెలకొల్పుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.
Janasena Chief Pawan Kalyan: 2024లో వైసీపీ ప్రభుత్వం పోతుంది.. ఒక్క సీటుకూడా గెలవకుండా బాధ్యత తనదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమను టూరిస్ట్ జోన్‌గా అభివృద్ధి చేస్తాం.. ఆధ్మాత్మిక టూరిజాన్ని నెలకొల్పుతామని చెప్పారు. ఇసుకను దోచుకున్న డబ్బును మళ్లీ ఓట్లుకోసం కేటాయిస్తారేమో.. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి గుండిపోటు అని నమ్మబలికారు అని మలికిపురం బహిరంగ సభలో పవన్ ప్రస్తావించారు. రాజోలు నుంచి ఛాలెంజ్ విసురుతున్నాను.. మా జనసేన ఎదుగుదలను ఎలా అడ్డుకుంటారు.. మీ ఇసుక దోపిడీ, మీ దౌర్జన్యాలను అడ్డుకోకపోతే తనపేరు పవన్ కళ్యాణ్ కాదు అన్నారు. దేవాలయాలను కాల్చేసిన వారిని మీరు వెనుకేసుకొస్తారు. సొంత చిన్నానను చంపిన అనకొండ అని సంచలన ఆరోపణలు చేశారు. దళితులకు మేనమామ అనే చెప్పుకుని దళిత పథకాలు తీసేశాడని సీఎంపై పవన్ సెటైర్లు వేశారు. విదేశీ విద్య పథకానికి జగన్ పేరు పెట్టుకున్నాడు. అంబేడ్కర్ గారి కంటే మీరు గొప్పవారు కాదు అన్నారు.
జనసేన అధికారంలో కి వస్తే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తాం.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు అభివృద్ధి చెందేలా మాస్టర్ ప్లాన్ లు ఉండాలన్నారు పవన్. వంతెన, రైల్వే లైన్లు మీరు పూర్తి చేయకపోతే జనసేన పూర్తిచేస్తుందన్నారు. సఖినేటి పల్లి బ్రిడ్జి పూర్తిచేస్తాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తామని చెప్పారు. ఓఎన్జీసీ, కెయిర్న్, గెయిల్ ఇతర సంస్థలకు సంబందించి నష్టపోతున్న పరిస్థితిపై వారితో మాట్లాడుతా.. అవసరమైతే ప్రధాని మోదీతో మాట్లాడి స్థానిక యువతకు ఉపాధికి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటు చేయిస్తాం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కేరళా తరహాలో క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను రివైల్ చేస్తాం. యాక్సెంట్‌లో మాట్లాడితే జ్ఞానం వచ్చినట్లు కాదు. ఇంగ్లీష్ అవసరం కానీ తెలుగు భాష అవసరం. వైసీపీ చంపేసిన తెలుగును పునరుద్ధరిస్తామని చెప్పారు పవన్.
ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాం. హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రతీ మనిషికి అవసరం.. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా పథకం ప్రవేశపెడతామన్నారు.. దీనికి ప్రీమియం ఫ్రభుత్వం కడుతుంది. యువత ఉపాధి పొందేందుకు ప్రతీ నియోజకవర్గానికి దామాషా ప్రకారం ఏడాదికి 500 మందిని ఎన్నుకుని అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయగలం. జనసేన అధికారం లేకుండానే చేయగలుగుతుంది.. అధికారమిస్తే ఏమైనా చేయగలమని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో అఖండ వెలుగును ఇవ్వండి. రాజోలులో వెలిగించిన చిరు దీపం రాష్ట్రంలో అన్ని జనసేన పోటీచేసిన అన్నిచోట్ల వెలుగు నింపాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ హెలీకాప్టర్‌లో వెళితే ఈ రోడ్లు సంగతి ఏం తెలుస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లికి వెళ్లేందుదుకు హెలీకాప్టర్ కావాలంటూ సెటైర్లు వేశారు. ఏమైనా మాట్లాడితే క్రిమినల్ కేసులు అంటారు. ఇవన్నీ ఎదిరించడానికి జనసేన పుట్టిందన్నారు.
Also Read: Pawan Kalyan: నా మీద చెయ్యి పడినా, రాయి పడినా తన్ని తగలేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్!
వేలకోట్లు దోపిడీ చేస్తున్న ఎమ్మెల్సీలపై ఏ ఏజెన్సీ ఆపగలదు.. పీపుల్స్ యాంటీ కరెప్షన్ ఏజెన్సీ ఆపాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి జరగాలంటే ఈప్రభుత్వం మారాలి.. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. హలో ఏపీ.. బైబై వైసీపీ.. అన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial