Pawan Kalyan: నా మీద చెయ్యి పడినా, రాయి పడినా తన్ని తగలేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్!
రక్షణ చట్టాలు సరిగ్గా పనిచేయకుండే ఆడపిల్లలపై దాడులు పెరుగుతాయని, ఆడపిల్లల జోలికి వస్తే కాళ్లు కీళ్లు విరగొట్టే బలమైన చట్టాలను తీసుకొస్తాం అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
Janasena Chief Pawan Kalyan Varahi Yatra, Malikipuram:
రక్షణ చట్టాలు సరిగ్గా పనిచేయకుండే ఆడపిల్లలపై దాడులు పెరుగుతాయని, ఆడపిల్లల జోలికి వస్తే కాళ్లు కీళ్లు విరగొట్టే బలమైన చట్టాలను తీసుకొస్తాం అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మలికిపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనకు ఉన్న రక్షణ వారాహి, జనసైనికులు, వీరమహిళలు అన్నారు. అయితే తన ఒంటిమీద చెయ్యి పడినా, ఒక్క రాయి పడినా, జనసైనికుల మీద ఒక్క చెయ్యిపడినా, మాట అన్నా, ఆడపడుచులను ఒక్క మాట అన్నా.. తన్ని తగలేస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాన్ని పిండి పిండి చేస్తున్నారు. ఈ నేలపై ఎలా నిలబడతారో చూస్తా. వైసీపీ క్రిమినల్స్‌ను హెచ్చరిస్తున్నాను. రాజోలు సభా వేదికగా మాట్లాడుతున్నాను. మా ప్రభుత్వం వచ్చిన రోజున ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతాం అంటూ బ్లేడ్ బ్యాచ్, బాంబుల బ్యాచ్‌కు ఇదే వార్నింగ్ అన్నారు.
గల్ఫ్ నుంచి విదేశాలకు వెళ్లేవారు చిక్కుకుపోయిన వారికోసం ప్రభుత్వం ఓ శాఖ ఉంది. దాన్ని యాక్ట్‌వేట్ చేయాలని, జనసేనను గెలిపిస్తే గల్ఫ్ బాధితులకోసం అసెంబ్లీలో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు. కార్పోరేషన్ పేర్లుతో కులాలను విడగొడ్తున్నారు.. కేవలం కార్పోరేషన్లు అలంకార ప్రాయంగా మాత్రమే మిగిలాయి. ఆ ఛైర్మన్లుకు కనీస సదుపాయాలు లేవన్నారు. యాదవ సమాజానికి కార్పోరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషిచేసి, రాబోయే రోజుల్లో ఇక్కడే తిరిగి ప్రతీ సమస్యను పరిష్కరిస్తాం అన్నారు.
అభివృద్ధి జరగాలంటే లాఅండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విద్య, వైద్యం ఇవన్నీ జనసేన దృష్టిపెడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. కులాల మధ్య ఘర్షణలు విడనాడాలి.. వీటిని నివారిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి తన కార్ డ్రైవర్‌ను చంపి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేశాడు.. అతను ఏ కులం అన్నది మర్చిపోవాలి. కాకినాడలో క్రిమినల్ సిండికేట్ నడిపై ద్వారంపూడి వద్దకు వెళ్లాడు. చంపింది కాపు అయితే చనిపోయిన వ్యక్తి దళితుడు అయితే మద్దతు తెలిపింది రెడ్డి సామాజిక వర్గం. ఆ వ్యక్తికి మద్దతు తెలిపింది ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. సమాజంలో కుళ్లు పేరుకుపోయి కులాల మధ్య గొడవలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ చేసిన తప్పు కాపు సామాజికి వర్గానికి సంబందం లేదు.. వ్యక్తులు చేసిన తప్పులు బలంగా మాట్లాడకుంటే కులాలకు అంటుకుంటాయని అభిప్రాయపడ్డారు.
‘ద్వారంపూడి అనే వ్యక్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను శాసిస్తున్నాడు. వ్యాపార రాజకీయాలే కాకుండా క్రైమ్ కూడా తోడవుతుంది. రాజోలులో గంజాయిలో బాగా అభివృద్ధి చెందిందని ఓ సోదరుడు తెలిపాడు. దేశ ప్రధాని, హోం మంత్రిని అపాయింట్‌మెంట్ అడుగుతా.. విశాఖకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఈ వైసీపీ దౌర్జన్యాలు గురించి చెప్పాలనుకున్నాను కానీ చివరిలో విరమించుకున్నాను. మీ సినిమా ఆపేశారని జాతీయ స్థాయి నాయకుడు అంటే ఆ నష్టం నేను భరిస్తానని తెలిపాను.
అంతర్వేది రథం కాలిపోతే, రాముని విగ్రహం తల నరికేస్తే దీనిపై నేను నిరసన తెలిపితే ముస్లిం సోదరులు మద్దతు తెలిపారు. ఉర్దూ మీడియంను మాతృభాషగా తీసుకొచ్చేందుకు జనసేన కృషిచేస్తుంది. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ కోసం, షాదీఖానాల గురించి కృషిచేస్తాను. రాష్ట్రంలో రెండు లక్షల మంది అర్చక సమాజం ఉంది. హిందూ భక్తులు విరాళాలు ఇస్తే దేవదాయ శాఖ దీనిపై ఆధారపడ్డ వారికి కొంతైనా కేటాయించాలని వైవీ సుబ్బారెడ్డి ఇది గమనించాలన్నారు. శ్రీవాణి ట్రస్టు అవకతవకలపై విచారణ జరిపిస్తాం. బాధ్యులకు శిక్షపడేలా చేస్తాం అన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial