Sehwag Trolls Adipurush: 'ఆదిపురుష్' చూశాక 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది - వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు
ప్రభాస్, ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఈ చిత్రంసై సటైర్లు విసిరారు.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్’ చిత్రం అభిమానులను అలరించడంలో విఫలం అయ్యింది. రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని భావించారు. కానీ, ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొంటుంది. పలువురు ఈ సినిమాపై విమర్శలు చేశారు. డైలాగ్స్ నుంచి వీఎఫ్‌ఎక్స్ వరకు అన్నింటిపైనా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. తాజాగా ఈ సినిమాపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ రేంజిలో సెటైర్లు విసిరారు.
'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది- వీరేంద్ర సెహ్వాగ్
రీసెంట్ గా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ‘ఆదిపురుష్’ చూశారు. సినిమాపై తనదైన మార్క్ సెటైర్లు వేశాడు. రాజమౌళి, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ‘బాహుబలి’తో ఈ సినిమాకు లింకు పెట్టిమరీ విమర్శలు గుప్పించాడు. 'ఆదిపురుష్' చూశాక 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది అంటూ ట్వీట్ చేశారు. పరోక్షంగా ఈ సినిమా చెత్తగా ఉందని చెప్పకనే చెప్పాడు. ఈ ట్వీట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ గరం అవుతున్నారు. ధోనీ టీమ్ నుంచి తప్పించి మంచి పని చేశాడంటూ కామెంట్లు పెట్టారు.
Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀
— Virender Sehwag (@virendersehwag) June 25, 2023
‘ఆదిపురుష్’ సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్
ఇప్పటికే ఈ సినిమాపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఏకంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూసేన ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కింది. రాముడు, సీత, హనుమంతుడు లాంటి హిందూ దేవుళ్ళ పాత్రలతో పాటు రావణుడి పాత్రను హాస్యాస్పందంగా రూపొందించారని విమర్శించింది. ఈ సినిమా కథ మొదలుకొని, పాత్రలన్నీ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేవిగా ఉన్నాయని తెలిపింది. అటు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏకంగా ఈ సినిమాను నిషేధించడంతో పాటు చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఈ సినిమా హిందువులు, సనాతన ధర్మం, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వెల్లడించింది.
Also Read : నార్కోటిక్ టెస్ట్‌కు రెడీ, కేపీ స్నేహితుడే కానీ డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు - జ్యోతి స్పందన
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ నిర్మించింది. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది, ఈ చిత్రంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకి పాత్రను పోషించింది. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రం 2020లో ప్రకటించినప్పటి నుండి భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది.
Read Also: ఇందిరా గాంధీ నిజంగా ఆ మాట అన్నారా? కంగనా ‘ఎమర్జెన్సీ’టీజర్ లో పెద్ద మిస్టేక్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial