Top 10 Headlines Today: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం, జేపీఎస్‌ల సమస్య తీర్పిన తెలంగాణ సర్కారు- మార్నింగ్ టాప్ హెడ్‌లైన్స్
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
Top 10 Headlines Today:
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి మార్గదర్శకాలను సోమవారం విడుదల చేశారు. గత వారంలో ఏపీ రాష్ట్ర సర్కారు బదిలీలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సర్కారు ఉద్యోగులు, ఉపాధ్యాయ బదిలీల విషయమై జగన్ సర్కారు వేర్వేరుగా మార్గదర్శకాలను విడుదల చేసింది. 8 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి విధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల (Junior Panchayat Secretaries) పని తీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని కేసీఆర్ సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడీ స్థాయి ఆఫీసర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తగ్గని ఎండ
ఉత్తర - దక్షిణ ద్రోణి విదర్భ నుండి తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో సోమవారం (మే 22) తెలిపారు. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కోటం రెడ్డి హౌస్ అరెస్టు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ను ఇంటినుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆయన ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. ఆయన అనుచరుల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు, ఎవర్నీ బయటకు రానివ్వడంలేదు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వాహనదారులకు చిట్కా
ఎండాకాలం పీక్‌కు చేరుకునే కొద్దీ మనదేశంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయి. ఈ ఉష్ణోగ్రతల కారణంగా మనం రోజువారీ ఉపయోగించే ఉపకరణాల్లో చాలా వేడెక్కుతాయి. మనం ఉపయోగించే ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ ఇలా అన్నిటికీ ఆ సమస్య వస్తుంది. ఇది కార్లకు కూడా తలెత్తుతుంది. ఒకవేళ కారు ఓవర్ హీట్ అయితే దాని కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోకపోతే కారు బ్రేక్‌డౌన్‌కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉద్యోగుల అల్టిమేటం
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పలుమార్లు ఉద్యమ బాట పట్టినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్ అయ్యారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, డీఏ చెల్లింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. విజయ్ కుమార్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, నరసాపురం తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష చేశారు. సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సంఘ సభ్యులతో కలిసి విజయ్ కుమార్ నినాదాలు చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదేళ్ల పండగ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన లోగోను నేడు (మే 22) ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ ఈ లోగోను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో లోగోను రూపొందించారు. నీటి పారుదల ప్రాజెక్ట్ లు, మిషన్ భగీరథ, వ్యవసాయానికి ఫ్రీ కరెంటు, రైతుబంధు, కొత్త సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారక జ్యోతి, యాదాద్రి ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టీ హబ్, పాలపిట్ట, బోనాలు, బతుకమ్మ లాంటివాటికి లోగోలో స్థానం కల్పించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మురికి వాడ మోడల్
ముంబయిలోని ఓ మురికి వాడ. ఇరుకైన ఇల్లు. అందులో ఓ 14 ఏళ్ల బాలిక. ఆమె కలల్ని ఆ నాలుగు గోడలు అడ్డుకోలేకపోయాయి. మెల్లగా ఇల్లు దాటాయి. అక్కడి నుంచి వాడ దాటి..ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. అప్పటి వరకూ చాలా సాదాసీదా జీవితం గడిపిన ఆ బాలిక..ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఫేమస్ మ్యాగజైన్ కవర్ పేజీలపైనా తన ఫోటోలు కనిపిస్తుంటే..అవి చూసుకుని తెగ మురిసిపోతోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విరాట్ విహారమేనా!
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2023లో చాలా మంచి ఫామ్‌లో కనిపించాడు. అతని బ్యాట్ నుంచి రెండు సెంచరీలు కూడా వచ్చాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ నిలకడగా పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2022లో కోహ్లీ చాలా బ్యాడ్ ఫామ్‌లో కనిపించాడు. ఈ సీజన్‌లో అతని ఫాం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్ ఇండియాకు ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
₹2 లక్షల కోట్ల డిపాజిట్లు రావచ్చని అంచనా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో, 2016 నాటి పెద్ద నోట్ల రద్దు సంఘటనలు తిరిగి కళ్లకు కట్టబోతున్నాయి. నోట్ల మార్పిడి, డిపాజిట్ల స్వీకరణ మంగళవారం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి, బ్యాంక్‌ల వద్ద పొడవాటి లైన్లు కనిపించవచ్చు. 2016 నాటి రచ్చ పునరావృతం కావచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి