Telangana Formation Day Logo: తెలంగాణ దశాబ్ది వేడుకల లోగో విడుదల - ఆవిష్కరించిన కేసీఆర్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ ఈ లోగోను ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన లోగోను నేడు (మే 22) ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ ఈ లోగోను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో లోగోను రూపొందించారు. నీటి పారుదల ప్రాజెక్ట్ లు, మిషన్ భగీరథ, వ్యవసాయానికి ఫ్రీ కరెంటు, రైతుబంధు, కొత్త సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారక జ్యోతి, యాదాద్రి ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టీ హబ్, పాలపిట్ట, బోనాలు, బతుకమ్మ లాంటివాటికి లోగోలో స్థానం కల్పించారు.





















