News
News
వీడియోలు ఆటలు
X

Maleesha Kharwa: మోడల్‌గా మెరిసిపోతున్న మురికివాడ అమ్మాయి, డిమాండ్‌ చూస్తే మైండ్ పోతుంది

Maleesha Kharwa: ముంబయిలోని ధారావిలో పుట్టి పెరిగిన మలీశా ఇప్పుడు మోడల్‌గా రాణిస్తోంది.

FOLLOW US: 
Share:

Maleesha Kharwa Success Story:

మలీశా ఖర్వా సక్సెస్ జర్నీ..

ముంబయిలోని ఓ మురికి వాడ. ఇరుకైన ఇల్లు. అందులో ఓ 14 ఏళ్ల బాలిక. ఆమె కలల్ని ఆ నాలుగు గోడలు అడ్డుకోలేకపోయాయి. మెల్లగా ఇల్లు దాటాయి. అక్కడి నుంచి వాడ దాటి..ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. అప్పటి వరకూ చాలా సాదాసీదా జీవితం గడిపిన ఆ బాలిక..ఇప్పుడు  బ్రాండ్ అంబాసిడర్‌ అయిపోయింది. ఫేమస్ మ్యాగజైన్‌ కవర్‌ పేజీలపైనా తన ఫోటోలు కనిపిస్తుంటే..అవి చూసుకుని తెగ మురిసిపోతోంది. ధారావిలోని మలీశా ఖర్వా (Maleesha Kharwa) కథ ఇది. ఇప్పుడామెని అంతా Princess of Slum గా పిలుచుకుంటున్నారు. 2020లో హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్‌మాన్ ( Robert Hoffman) ఆమెని గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆమెకు ఆర్థిక సాయం చేయాలంటూ Go Fund Me Page క్రియేట్ చేశాడు. ఆ తరవాత ఒక్కసారిగా ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. అప్పటి వరకూ ఆమె ఎవరో కూడా తెలియని వాళ్లు "ఎవరీ మలీశా" అని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. క్రమంగా ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 25 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌కి  #princessfromtheslum అనే హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేస్తుంది. ఎందుకంటే నెటిజన్లు ఆమెని అలాగే గుర్తిస్తున్నారు మరి. ఫాలోయింగ్ పెరగడమే కాదు. మోడలింగ్‌ అవకాశాలూ వచ్చాయి. అలా ఈ ఫీల్డ్‌లోకి వచ్చేసింది మలీశా. Live Your Fairytale అనే షార్ట్‌ఫిల్మ్‌లోనూ తళుక్కుమంది. ఇప్పుడు మరో అదిరిపోయే ఆఫర్ ఆమెని వెతుక్కుంటూ వచ్చింది. 

View this post on Instagram
 
A post shared by Cosmopolitan India (@cosmoindia)

బ్రాండ్ అంబాసిడర్..

Forest Essentials అనే ఓ కాస్మొటిక్స్ కంపెనీ Yuvati Selection పేరిట ఓ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది. యువతను ఎంపవర్ చేయడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశం. ఈ ప్రచారానికి మలీశా ఖర్వాని ఎంపిక చేసింది ఆ కంపెనీ. ఏప్రిల్‌లో ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చింది. అంతే కాదు. ఆమెని వెంటబెట్టుకుని తమ స్టోర్‌కి తీసుకెళ్లింది. ఆ స్టోర్‌కి ఎదురుగా ఓ హోర్డింగ్ కనిపించింది. దానిపై మలీశా తన ఫోటోను చూసి మురిసిపోయింది. ఒక్కసారిగా తన ముఖం వెలిగిపోయింది. "కలలు నిజం అవుతాయి అనడానికి ఓ అందమైన ఉదాహరణే మలీశా కథ" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌ కంపెనీ. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టోర్‌లో మలీశా దిగిన ఫోటోలూ వైరల్ అయ్యాయి. మలీశా లాంటి ఎంతో మంది యువతను ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే తమ లక్ష్యమని ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఫౌండర్ మీరా కులకర్ణి (Mira Kulkarni) చెప్పారు. ఇంత సక్సెస్ వచ్చినా సరే...మలీశా చదువు పక్కన పెట్టలేదు. ఇటు మోడల్‌గా రాణిస్తూనే అటు స్టడీని కంటిన్యూ చేస్తోంది. "ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఆఫర్ వచ్చిందంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. నాకు మోడల్ అవ్వాలనుంది. కానీ...చదువుకే నా ఫస్ట్ ప్రయారిటీ" అని చెబుతోంది మలీశా ఖర్వా. 

View this post on Instagram
 
A post shared by @forestessentials

Also Read: నలుగురు భార్యలతో మస్క్ మామ ఫొటో షూట్, తప్పులో కాలేయకండి - ఇక్కడో ట్విస్ట్ ఉంది

Published at : 22 May 2023 05:47 PM (IST) Tags: Mumbai Dharavi Maleesha Kharwa Robert Hoffman Forest Essentials Yuvati Selection princess from the slum

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!