నలుగురు భార్యలతో మస్క్ మామ ఫొటో షూట్, తప్పులో కాలేయకండి - ఇక్కడో ట్విస్ట్ ఉంది
Optimus Robots: టెస్లా సంస్థ తయారు చేసిన ఆప్టిమస్ రోబోలతో ఎలన్ మస్క్ ఫోటోలు దిగారు.
Tesla Optimus Robots:
ఆప్టిమస్ రోబోలు
ఎలన్ మస్క్ పేరు ప్రస్తావించని రోజు గడవదు మీడియాకి. అంతలా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారాయన. ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తరవాత సంచలన నిర్ణయాలతో ఇంకా ఫేమస్ అయిపోయారు. ఈ సారి కూడా మళ్లీ ట్రెండ్ అవుతున్నారు. కానీ...ఇప్పుడు ట్వీట్‌లతో కాదు. ఫోటోలతో. ఫోటోలతో ట్రెండ్ అయ్యేదేముంది..? అని లైట్ తీస్కోకండి. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఆయన నలుగురు అమ్మాయిలకు ముద్దులు పెడుతూ ఫోటో షూట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ...ట్విస్ట్ ఏంటంటే...ఆయన ముద్దాడిన అమ్మాయిలు..నిజమైన అమ్మాయిలు కాదు. కేవలం రోబోలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌తో వీటిని తయారు చేశారు. Daniel Mavern అనే ఓ ట్విటర్ యూజర్ ఈ ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఎలన్ మస్క్ తన ఫ్యూచర్ వైఫ్‌లను పరిచయం చేశాడంటూ ఫన్నీగా పోస్ట్ పెట్టాడు. తొలి ఫిమేల్ రోబోట్ అని...మస్క్ దగ్గరుండి మరీ తనకు నచ్చిన ఫీచర్‌లతో ఈ రోబోలను తయారు చేయించుకున్నాడని చెప్పాడు ఆ యూజర్. అసలు ఇలాంటి పర్సనాలిటీతో ఈ భూమ్మీద ఏ అమ్మాయి కనిపించదని, అంత యునిక్‌గా వీటిని డిజైన్ చేయించారని వివరించాడు. వీటిలో Catnilla Robot ని సోలార్ పవర్‌తో ఛార్జ్ చేయనున్నట్టు చెప్పాడు. అంతే కాదు. మనుషుల్లాగే వీటికీ ఫీలింగ్స్ ఉండేలా స్పెషల్ సెన్సార్లు కూడా అమర్చారు. టెస్లా కంపెనీ వీటికి "Optimus" అని పేరు పెట్టింది. వీటిని AI Toolతో డిజైన్ చేశారు.
Elon Musk announces the future wife who is she?
— Daniel Marven (@danielmarven) May 16, 2023
It is the first robot that has been manufactured specifically designed with artificial intelligence with the personality and the characteristics of the female that he dreams of…which is not found in any normal person, because of… pic.twitter.com/a2JdpTfwef
ట్విటర్‌లో కొత్త ఫీచర్..
ఎలాన్ మస్క్ టేకోవర్ చేయకముందు ట్విట్టర్లో కేవలం రెండు నిమిషాల 20 సెకన్ల నిడివి వరకు మాత్రమే వీడియోలను అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉండేది. ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ వెరిఫికేషన్ తెచ్చాక దీన్ని మొదట 60 నిమిషాల వరకు పెంచారు. ఇప్పుడు ఏకంగా రెండు గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏ భాషకు సంబంధించిన సినిమా విడుదల అయినా దానికి సంబంధించిన క్లిప్స్ ట్విట్టర్లో తిరుగుతూ ఉంటాయి. ఈ ఫీచర్ పుణ్యమా అని ఇప్పుడు మొత్తం సినిమాను ట్విట్టర్లో పెట్టే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక నెటిజన్ అయితే మరో అడుగు ముందుకేసి ఇటీవలే రిలీజ్ అయిన ‘ఈవిల్ డెడ్ రైజ్’ సినిమా పైరసీ ప్రింట్‌ను ఇప్పటికే అప్లోడ్ చేశారు. కొంతమంది బాస్కెట్ బాల్, ఇతర క్రీడలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ట్విట్టర్ వెంటనే స్పందించి ఆ వీడియోను డిలీట్ చేయించినప్పటికీ అందులో కంటెంట్ అప్పటికే డౌన్లోడ్ల ద్వారా వైరల్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Elon Musk: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై మస్క్ అసహనం, ఊహల్లో తేలుతున్నారంటూ సెటైర్లు