అన్వేషించండి

Top Headlines Today: తిరుమలలో చిక్కిన మరో చిరుత- ఎన్నికల వేళ తెలంగాణలో తెరిపైకి రజాకార్‌ ఫైల్స్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today

ఎందుకీ కేసుల పరంపర?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుసగా కేసులు నమోదు చేస్తోంది. నిజానికి ఈ కేసులు ఇప్పటివి కావు. పాతవి. ఏళ్లు గడుస్తున్నా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారు బెయిల్ మీద కూడా విడుదలయ్యారు. కానీ కొత్తగా చంద్రబాబు ప్రధాన పాత్ర ధారి అంటూ పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుతో పాటు తాజాగా ఫైబర్ నెట్ స్కాం కేసులోనూ పీటీ వారెంట్  కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ సీఐడీ చాలా ప్రణాళికతో చంద్రబాబును వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనుకుంటోందని తాజా పరిణామాలను బట్టి టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా న్యాయపోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అదే నిజమైతే వైసీపీ రాజకీయ వ్యూహం ప్రత్యర్థిని జైల్లో పెట్టి తాను ఎన్నికలకు వెళ్లాలనుకోవడం లాంటిదేనని.. అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మరో చిరుత చిక్కింది

తిరుమలలో బోనుకు మరో చిరుత చిక్కింది.. అలిపిరి నడక మార్గంలోని లక్షితపై దాడి చేసిన ఘటనకు అతి సమీపంలో 2850 మెట్టు వద్ద టిటిడి అటవీ శాఖాధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.. వారం రోజులుగా అదే ప్రాంతంలో తిరుగుతూ ఇవాళ వేకువజామున బోనులో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఎరకు చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతను తిరుపతిలోని జూపార్క్‌కు తరలించారు. ఇప్పటి వరకూ మొత్తం 6 చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించి జూపార్క్ తరలించారు.. ఇందులో రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రజాకార్ సినిమా పాలిటిక్స్

తెలంగాణలో రజాకార్ సినిమా ట్రైలర్ విడుదల అయింది . ట్రైలర్ చూసిన చాలా మంది రెండు రకాలుగా విడిపోయారు. ఒకరు మత విద్వేషాలను పెంచే ప్రయత్నమని విమర్శలు చేస్తూండగా.. నిజాలు చెబితే తప్పేమిటని మరొకరు వాదిస్తున్నారు. ఈ సినిమా వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చాయి. అసలు రాజకీయాల కోసమే ఈ సినిమా తీశారు. ఇక రాజకీయం కాకుండా ఎలా ఉంటుంది. చరిత్ర తెలియని మూర్ఖులు మత విద్వేషాల కోసం ఈ సినిమా తీశారని.. తాము అడ్డుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ఇది రాజకీయంగా  కలకలం  రేపే సినిమా కావడంతో రాజకీయ పార్టీలు తమ విధానాల్ని ప్రకటిస్తున్నాయి. అనుకూలంగానో వ్యతిరేకంగానో ప్రకటనలు చేస్తున్నాయి.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మరో ముందడుగు 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి వెళ్తామని, జగన్‌ను ఓడించేందుకు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ ఈ ప్రకటన చేశారు. చంద్రబాబుకు కూడా తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పినట్లు మీడియా సమావేశంలో పవన్ వెల్లడించారు. ఇప్పటినుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన కలిసి పోరాటం చేస్తాయని, రెండు పార్టీలు ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తాయని పవన్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మైనంపల్లి దారెటు?

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయంగా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు.  బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటారా..? పార్టీని వీడతారా..? ఏ పార్టీలో చేరుతారు..? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు..? అన్న అంశంపై అనుచరులకూ క్లారిటీ లేకుండా పోయింది. మైనంపల్లి కూడా ఏమీ చెప్పడం లేదు. ఆయనకు కాంగ్రెస్ రెండు సీట్లను ఆఫర్ చేసిందని.. పదిహేడో తేదీన కాంగ్రెస్ లో చేరిపోతారని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏముంది?

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్రకేబినెట్ 18న ఆమోదం తెలిపింది. 19న  కేంద్ర ప్రభుత్వంలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్న వేళ.. ఈ బిల్లు చట్టంగా మారితే లోక్‌సభ, శాసనసభలన్నింటిలో అతివలకు 33 శాతం అవకాశాలు అందిస్తాయి. ఇంతకాలానికి  మహిళల చిరకాలస్వప్నం నెరవేరనుంది. తాజాగా ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో 128వ రాజ్యాంగ సవరణ బిల్లు-2023 చట్ట రూపం సంతరించుకున్న తర్వాత మొదలుపెట్టే తొలి జనగణన అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బిల్లుపై కేటీఆర్ హర్షం 

దాదాపు 3 దశాబ్దాలుగా చట్టంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు (Women Reservation Bill )ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 19న మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కొన్ని విషయాలలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై స్పందించారు. ఈ బిల్లు పట్ల ఓ భారతీయుడిగా తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చే అంశానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్‌ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అజిత్‌ నెక్స్ట్ మూవీకి రెడీ

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌ తన నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయార్చి’ అనే సినిమా చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచీ రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతూనే వుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వచ్చింది. ఈ వార్తలకు బలం చేకూరేలా అజిత్ - సంజూ భాయ్ ల సెల్ఫీ ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సమంత చిట్‌చాట్

ఇటీవల 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, తన ఆరోగ్య పరిస్థితి కారణంగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్‌ కు చికిత్స తీసుకోడానికి అమెరికాకు వెళ్ళింది. అక్కడ వివిధ ప్రదేశాల్లో విహరిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఆ విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా సామ్ ఇంస్టాగ్రామ్ లో చాట్ చాట్ నిర్వహించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. సినిమా సంగతులే కాకుండా కొన్ని మోటివేషన్ విషయాలను పంచుకుంది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రజనీకి ‘గోల్డెన్ టికెట్’

వచ్చేనెల 5 నుంచి  భారత్ వేదికగా జరుగబోయే  వన్డే వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించేందుకు గాను  సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ‘గోల్డెన్ టికెట్’ను అందింది.  బీసీసీఐ కార్యదర్శి రజినీకాంత్.. స్వయంగా చెన్నైలోని రజినీ ఇంటికి వెళ్లి మరీ  ఈ గోల్డెన్ టికెట్‌ను  జైలర్ హీరోకు అందజేశాడు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? - దీని బారిన పడకుండా ఏం చేయాలి?
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Viral Video: జగన్నాథుని విగ్రహం ముందు శిరస్సు వంచిన కోడి - వైరల్ వీడియో
జగన్నాథుని విగ్రహం ముందు శిరస్సు వంచిన కోడి - వైరల్ వీడియో
Embed widget