అన్వేషించండి

Ajith - Sanjay Dutt : దుబాయ్‌లో అజిత్, సంజయ్ దత్ - ఆ సినిమాలో ఒకరినొకరు ఢీ కొట్టబోతున్నారా?

Vidaa Muyarchi : 'లియో'లో విజయ్ తో నటిస్తున్న సంజయ్ దత్.. అజిత్ కు విలన్ గా మారబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజిత్ - దత్ లు కలిసున్న ఓ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌ తన నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయార్చి’ అనే సినిమా చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచీ రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతూనే వుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వచ్చింది. ఈ వార్తలకు బలం చేకూరేలా అజిత్ - సంజూ భాయ్ ల సెల్ఫీ ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

తాజాగా దుబాయ్‌ లో అజిత్ కుమార్‌, సంజయ్‌ దత్‌ లు ఒక్క చోట చేరి సందడి చేశారు. ఈ సందర్భంగా సంజయ్ సతీమణి మాన్యతా దత్‌ ఇద్దరు స్టార్ యాక్టర్స్ తో కలిసి దిగిన సెల్ఫీ ఫోటో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. 'విడాముయార్చి' మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చాలా రోజులుగా పుకార్లు వస్తున్నాయి కానీ, చిత్ర నిర్మాతల నుండి అఫిషియల్ కన్ఫర్మేషన్ లేదు. అలానే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అబుదాబిలో జరుగనుందని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ ఫొటోతో అన్నిటికీ క్లారిటీ వచ్చేసిందని అభిమానులు భావిస్తున్నారు.

గతంలో అక్కినేని నాగార్జున నటించిన 'చంద్రలేఖ' సినిమాలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన సంజయ్ దత్.. 'KGF 2' చిత్రంతో విలన్ గా సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం రామ్ - పూరీ జగన్నాథ్ కాంబోలో రూపొందే 'డబుల్ ఇస్మార్ట్' లో నటిస్తున్నాడు. అలానే తలపతి విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లియో' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఆంటోనీ దాస్ పాత్రలో దత్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ఆకట్టుకుంది. 

లియో రిలీజ్ అవ్వకముందే అజిత్ కుమార్ 62వ చిత్రంలో విలన్ గా నటించడానికి సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అజిత్ - దత్ కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చింది. మరి త్వరలోనే వీరిద్దరి సహకారాన్ని నిజం చేస్తూ, 'విదాముయార్చి' మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

అజిత్ చివరగా 2023 సంక్రాంతికి 'తునివు' సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. దీని తర్వాత విఘ్నేష్ శివ‌న్ దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉండేది. కానీ కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది. దీంతో మగిజ్ తిరుమేని లైన్ లోకి వచ్చాడు. తాడయ్యరా తాక్క, మేఘమాన్, తడమ్, కలగ తలైవన్ చిత్రాలతో దర్శకుడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అజిత్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

'విడా ముయర్చి' చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. కథానుగుణంగా ఇద్దరు హీరోయిన్స్ ఉండగా.. అందులో త్రిష కృష్ణన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలానే అరుణ్ విజయ్, అర్జున్‌ దాస్ లు కీలక పాత్రలో నటిస్తారని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తారు. నిర‌వ్ షా సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారు.

Also Read: 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటానని అనుకోలేదు: సమంత

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget