By: ABP Desam | Updated at : 20 Sep 2023 07:55 AM (IST)
పవన్ కళ్యాణ్
TDP Janasena Meeting: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి వెళ్తామని, జగన్‌ను ఓడించేందుకు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ ఈ ప్రకటన చేశారు. చంద్రబాబుకు కూడా తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పినట్లు మీడియా సమావేశంలో పవన్ వెల్లడించారు. ఇప్పటినుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన కలిసి పోరాటం చేస్తాయని, రెండు పార్టీలు ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తాయని పవన్ ప్రకటించారు.
పొత్తుపై అధికారికంగా ప్రకటన చేసిన టీడీపీ, జనసేన.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాయి. ఈ నెలలో రెండు పార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నాయి. ఈ భేటీలో రెండు పార్టీల ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే టీడీపీతో సమన్వయం చేసుకునేందుకు తన పార్టీ తరపున సమన్వయ కమిటీని జనసేన ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీ స్పీకర్, జనసేన పొలిటికల్ అపైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పవన్ కళ్యాణ్ నియమించారు. నాదెండ్లకు ఉన్న రాజకీయ అనుభవం ఇందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. కానీ సమన్వయ కమిటీ సభ్యులను మాత్రం జనసేన ఇంకా నియమించలేదు.
త్వరలోనే నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులను జనసేన నియామకం చేయనుంది. ఇందులో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని జనసేన భావిస్తుంది. ఇక టీడీపీ నుంచి కూడా సమన్వయ కమిటీని నారా లోకేష్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. హస్తిన నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ అవ్వనున్నారు. ఈ సందర్బంగా టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుల నియామకంపై చంద్రబాబుతో చర్చించనున్నారు. అనంతరం సమన్వయ కమిటీని లోకేష్ ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఈ నెలలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
పొత్తుపై ఎలా ముందుకెళ్లాలి? కలిసి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి? అనే అంశాలపై ఉమ్మడి కార్యాచరణ సిద్దం చేయనున్నారు. అనంతరం రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లనున్నాయి. రెండు పార్టీలు ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో సీట్ల సర్ధుబాటుపై కూడా రెండు పార్టీలు చర్చించుకోనున్నాయి. ముందుగానే సీట్ల ఒప్పందంపై ఒక అవగాహనకు రానున్నాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఓట్ల బదిలీ జరగడానికి సమయం ఉంటుందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించడం వల్ల ఓట్ల బదిలీ వెంటనే జరగదని, దీని వల్ల నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. ఇంతకుముందు దసరా కల్లా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని టీడీపీ ఆలోచించింది. కానీ చంద్రబాబు అరెస్ట్ పరిణామాల క్రమంలో కాస్త అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కానుంది. తొలి సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
APBJP : ఏపీలో మద్యం స్కాంపై సీబీఐ విచారణ - కేంద్రాన్ని కోరుతామన్న పురందేశ్వరి !
YS Bhaskar Reddy : చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి విడుదల - ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చిన కోర్టు !
Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి
TDP News : స్కిల్ ప్రాజెక్టులో వాస్తవాలు ఇవిగో - టీడీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ !
చంద్రబాబును 2 రోజులు సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత కీలక నిర్ణయం
Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!
50 ఏళ్లలో ఇంత చెత్త ప్రధానిని చూడలేదు, ఓ సర్వేలో దారుణమైన రేటింగ్ - ట్రూడోపై ఓటర్ల అసహనం
/body>