అన్వేషించండి

Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై

Telangana News: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా ఓ అభ్యర్థి గుండెపోటుకు గురైన ఘటన పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగింది. వెంటనే స్పందించిన ఎస్సై అతన్ని భుజాలపై మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు.

Candidate Get Heart Attack While Writing Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా ఓ అభ్యర్థికి గుండెపోటు రాగా.. వెంటనే స్పందించిన ఎస్సై అతన్ని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు. మరో గంటలో పరీక్ష ముగుస్తుందనగా ఈ ఘటన జరిగింది. పటాన్‌చెరు (Patancheru) పీఎస్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పుల్కల్ గ్రామం లక్ష్మీనగర్‌కు చెందిన ఎల్.నగేశ్ గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం నాలుగో పేపర్ పరీక్ష రాస్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. దీంతో నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

భుజాలపై మోసుకెళ్లిన ఎస్సై..

108 వాహనం వచ్చే సమయం లేకపోవడంతో పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తోన్న ఎస్సై ఆసిఫ్ వెంటనే స్పందించారు. మూడో అంతస్తులో ఉన్న నగేశ్‌ను భుజంపై మోసుకుంటూ కిందకు తీసుకొచ్చి.. వాహనంలో ఎక్కించుకుని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. అయితే, సదరు వ్యక్తికి మూర్ఛ వ్యాధి ఉందని.. అది గుండెపోటు కాకపోవచ్చని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

పురిటి నొప్పులతోనే..

అటు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ అభ్యర్థి పురిటినొప్పులతోనే పరీక్ష రాశారు. పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన సెంటర్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే, అందుకు ఆమె అంగీకరించకుండా పరీక్ష రాస్తానని చెప్పారు. కాన్పు తేదీ సైతం సోమవారమే కావడంతో పరీక్షా కేంద్రం సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సదరు అభ్యర్థి పట్టు వదలకుండా పరీక్షా రాస్తానని చెప్పడంతో.. అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో పరీక్ష కేంద్రంలో 108 అత్యవసర వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ప్రత్యేక వైద్య సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. ఆమెకు ఎప్పుడు తీవ్ర నొప్పులు వచ్చినా.. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం చేశారు. రేవతి భర్త, ఆమె తల్లి కూడా అందుబాటులో ఉన్నారు. కాగా, నొప్పులతోనే ఆమె పరీక్ష పూర్తి చేశారు.

Also Read: Bhuvanagiri: భువనగిరి స్కూల్ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు - మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, సిబ్బంది సస్పెండ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఢిల్లీలో ప్రధాని ఇంటి వద్ద ఉద్రిక్తత- రోడ్డుపై పడుకొని రాహుల్ గాంధీ నిరసన  
ఢిల్లీలో ప్రధాని ఇంటి వద్ద ఉద్రిక్తత- రోడ్డుపై పడుకొని రాహుల్ గాంధీ నిరసన  
KTR Luxettipet Rythu Sadasu: మాది పోరంబోకు జాతి కాదు.. వలసపాలకుల సంక నాకే దగుల్బాజీ జాతి అసలే కాదు - రేవంత్‌కు కేటీఆర్ మాస్ కౌంటర్
మాది పోరంబోకు జాతి కాదు.. వలసపాలకుల సంక నాకే దగుల్బాజీ జాతి అసలే కాదు - రేవంత్‌కు కేటీఆర్ మాస్ కౌంటర్
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget