News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: ప్రత్యేక సమావేశాల్లో సంచల నిర్ణయాలు ఉంటాయా? జమిలీకి ఏపీ పార్టీలు సిద్ధమైనట్టేనా? మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today:

సమావేశాల అజెండా ఏంటీ?

దేశ రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి సంబంధించి అతి కీలకమైన నిర్ణయాలను తీసుకోవడానికి బీజేపీ పెద్దలు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తాజా పరిణామాలను బట్టి దేశ ప్రజలు ఓ అంచనాకు వస్తున్నారు. ఆ కీలక నిర్ణయాలు ఏమిటన్నది మాత్రం ఎవరి ఊహకు అందడం లేదు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఎజెండాను ఇంత వరకూ బహిర్గత  పర్చలేదు. త్వరలో చెబుతామంటున్నారు. అదేమిటన్నది స్పష్టత రావాల్సి ఉంది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఖచ్చితంగా జమిలీ ఎన్నికల నిర్ణయం జరగబోతోందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. దీనికి కారణం మాజీ  రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ తో జమిలీ ఎన్నికలపై కమిటీ వేయడం .. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే నివేదిక ఇవ్వాలని సూచించజం ఓ సూచికగా కనిపిస్తోంది. కానీ అంతకు మించి దేశం ఆశ్చర్యపోయే నిర్ణయాలు ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీ రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయా?

దేశంలో ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఏపీలో చాలా కాలం నుంచే ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలపై గతంలోనే చంద్రబాబు ప్రకటనలు చేశారు. అదే సమయంలో బీజేపీ నేతలు మళ్లీ ప్రజాతీర్పు కోరాలని సవాల్ చేసినప్పుడు.. బీజేపీ పార్లమెంట్  ను రద్దు చేస్తే తాము కూడా చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత వైసీపీ నేతలు వేగంగా ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తోంది. లోకేష్ పాదయాత్ర వడివడిగా జరుగుతోంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్నారు. వీలైనంత ముందుగా పాదయాత్ర ముగియనుంది.  దీనికి కారణం  ముందస్తుపై ముందుగా సమాచారం రావడమేనని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కాకినాడలో చంద్రబాబు టూర్

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా...చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ రోజులు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట 45 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు సహా నియోజకవర్గ ఇన్​ఛార్జ్​లు అంతా 3 కోట్ల మందిని కలవనున్నారు. ప్రజలను నేరుగా కలిసి...చైతన్యం తీసుకొచ్చి ...నమ్మకం కలిగించటమే లక్ష్యంగా బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని రూపొందించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో వివరించేందుకు బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

గొర్రిల్లా గ్లాస్ తయారీ కంపెనీ

తెలంగాణ...పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతున్న రాష్ట్రానికి...అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి  చూపిస్తున్నాయ్. తాజాగా మెటీరియల్‌ సైన్సెస్‌ లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్‌ సంస్థ...తెలంగాణ పెట్టుబడులు పెట్టబోతోంది. దేశంలో మొదటిసారి స్మార్ట్‌ఫోన్‌లకు వినియోగించే... గొరిల్లా గ్లాస్‌ తయారు చేయడానికి ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది.  అమెరికా పర్యటిస్తున్న పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్....కార్నింగ్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జాన్‌ బేన్‌, గ్లోబల్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ రవికుమార్‌, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్‌ సారా కార్ట్‌మెల్‌తో సమావేశం అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఆదిత్య ప్రయాణం 

10 రోజుల క్రితం ఆగస్టు 23న అంతరిక్షంలో భారత్ తనదైన ముద్ర వేసింది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 దిగ్విజయంగా పని చేస్తూ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచంది. చంద్రయాన్ -3 ప్రయోగించిన సుమారు రెండు నెలల తరువాత ఇస్రో మరొక చారిత్రాత్మకమైన మిషన్ అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్ధమైంది. అదే ఆదిత్య ఎల్ 1. ఈ మిషన్ సూర్యుడికి సంబంధించినది. మరికొద్ది గంటల్లోనే ఇది తన ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నాల్గో దశ వారాహి యాత్ర త్వరలో

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగేది అందుకేనని, రాజ్యాంగ సవరణకు కమిటీతో ముందడుగు పడిందని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ వైరి వర్గాలు మాత్రం జమిలి ఓ పొలిటికల్ గేమ్ అని కొట్టిపారేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోతున్న ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించిన బీజేపీ, జమిలి వ్యూహం తెరపైకి  తెచ్చిందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇండియా కూటమిలో కూడా ఇదే చర్చ జరిగింది. ఇటు బీజేపీ మిత్రపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని ముందుగానే స్వాగతిస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. జనసేన ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బ్రిటీష్‌ వాళ్ల వల్లే కాలేదు

'కాంగ్రెస్ రహిత' భారతదేశాన్ని స్థాపించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నాస్త్రాలు సంధించారు. శుక్రవారం(సెప్టెంబర్ 1) ముంబయిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. బీజేపీ, మోదీ చేస్తున్న ప్రయత్నాలపై సెటైర్లు వేశారు. ప్రధాని రాజకీయ అజెండాపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రభావాంపైనా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

హైఓల్టేజ్ మ్యాచ్

గత సంవత్సరం ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. అయితే ఈసారి ఆసియా కప్ ఫార్మాట్‌ను మార్చారు. ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు టీ20లో కాకుండా వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్నాయి. అయితే ఈ ఫార్మాట్‌లో ఎందుకు మార్పు చేశారో తెలుసా? నిజానికి ఆసియా కప్ మొదటి ఎడిషన్ 1984 సంవత్సరంలో జరిగింది. ఈ టోర్నమెంట్‌ను వన్డే ఫార్మాట్‌లో ఆడారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పవన్‌ను పవర్‌ స్టార్‌ను చేసిన సినిమాలు

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ, అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ డైరెక్టర్ల వెనుక పరుగులు తీయకుండా, వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యత ఇస్తూ సొంత స్టార్‌డమ్ ను సృష్టించుకున్నాడు.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయగలిగే 'పవర్ స్టార్' గా ఎదిగాడు. సినిమా కోసం ఎలాంటి సాహసమైనా చేయడానికి సిద్ధపడే తత్త్వం... అతని స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్ వంటివి పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుపెట్టాయి. అవే ఆయన్ని క్రేజ్ కు పర్యాయపదంగా మార్చాయి. నటుడిగానే కాకుండా నిర్మాతగా, రైటర్ గా, దర్శకుడిగానూ నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అయితే కేవలం సినిమాలకే పరిమితం అవ్వకుండా, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజా సేవ చేస్తున్నారు. అలాంటి పవన్ ఈరోజుతో 52 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అల్లుఅర్జున్‌కి నిర్మాతల మండలి లేఖ

ఒక తెలుగు సినిమా హీరోకు నేషనల్ అవార్డ్ రావడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక తెలుగు హీరో నేషనల్ అవార్డ్ అందుకొని చాలాకాలమే అయ్యింది. అలాంటిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ అవార్డ్‌ను అందుకొని కేవలం తన ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. మొత్తం తెలుగు ప్రేక్షకులనే గర్వపడేలా చేశాడు. దీంతో ఎంతోమంది దగ్గర నుంచి అల్లు అర్జున్‌కు అభినందనలు అందుతున్నాయి. తాజాగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్‌ను అభినందిస్తూ ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్‌ను ఎంతో సంతోషంతో సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

Published at : 02 Sep 2023 08:56 AM (IST) Tags: Breaking News AP news today Andhra Pradesh News Todays latest news Top 10 headlines today Todays Top news Telugu Top News Website Top 10 Telugu News

ఇవి కూడా చూడండి

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

ABP Desam Top 10, 4 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 4 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...