By: ABP Desam | Updated at : 01 Sep 2023 10:48 PM (IST)
Image Credit: Allu Arjun/ Twitter
ఒక తెలుగు సినిమా హీరోకు నేషనల్ అవార్డ్ రావడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక తెలుగు హీరో నేషనల్ అవార్డ్ అందుకొని చాలాకాలమే అయ్యింది. అలాంటిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ అవార్డ్‌ను అందుకొని కేవలం తన ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. మొత్తం తెలుగు ప్రేక్షకులనే గర్వపడేలా చేశాడు. దీంతో ఎంతోమంది దగ్గర నుంచి అల్లు అర్జున్‌కు అభినందనలు అందుతున్నాయి. తాజాగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్‌ను అభినందిస్తూ ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్‌ను ఎంతో సంతోషంతో సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ.
టాలీవుడ్‌లో నిర్మాతలు అందరికీ ప్రత్యేకంగా ఒక కౌన్సిల్ ఉంటుంది. అదే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి. ఒక తెలుగు హీరో అయ్యిండి నేషనల్ అవార్డ్ అందుకున్నందుకు అల్లు అర్జున్‌ను అభినందిస్తూ లేఖ రాసింది ఈ మండలి. ‘పుష్పలో మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ద్వారా భారత ప్రభుత్వం దగ్గర నుంచి 69వ నేషనల్ అవార్డ్ అందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మీకు మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు కూడా గర్వకారణం. ఈ సందర్భంగా మేము తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి మీకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నాము’ అంటూ రాసున్న లేఖను అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అల్లు అర్జున్ తన కెరీర్ బిగినింగ్ నుంచి చాలావరకు స్టైలిష్‌గానే డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తూ వచ్చాడు. అందుకే ఫ్యాన్స్ తనకు స్టైలిష్ స్టార్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఆ స్టైల్ అంతా పక్కన పెట్టి మొదటిసారి ‘పుష్ప’ కోసం డీ గ్లామర్ రోల్‌లో కనిపించాడు అల్లు అర్జున్. దీంతో ఒక్కసారిగా స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ‘పుష్ప’లో పుష్ప రాజ్ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ మేక్ఓవర్, ట్రాన్ఫర్మేషన్.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయి కూడా. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు.. దర్శకుడు సుకుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అందుకే ఎక్కువగా గ్రాఫిక్స్‌ను ఉపయోగించకుండా లైవ్ లొకేషన్స్‌లోనే నేచురల్‌గా సినిమాను తెరకెక్కించాడు.
అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ ప్రకటించిన ఆ నిమిషం.. తన ఇంట్లో మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత కూడా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు నేరుగా వెళ్లి తనను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని బన్నీ స్వయంగా సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇదే సందర్భంగా ‘పుష్ప 2’ గురించి కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలైతే ‘పుష్ప 2’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఇంకా షూటింగ్ సగం కూడా పూర్తవ్వలేదు. కానీ ఇప్పటికే విడుదలయిన ‘పుష్ప 2’ ఫస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్టుగా మూవీ టీమ్ తాజాగా అప్డేట్ ఇచ్చింది.
Also Read: ఆ కవర్లో రూ.100 కోట్ల చెక్? ‘జైలర్’ మూవీకి రజినీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్, అంతకుమించి?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్
Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్
Bhagavanth Kesari Songs : 'భగవంత్ కేసరి' బంధం విలువ చెప్పే పాట - 'ఉయ్యాలో ఉయ్యాల' రిలీజ్ ఎప్పుడంటే?
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
/body>