Top 10 Headlines Today: బీజేపీ రానంటే పవన్ పయనమెటు? ఒంగోలులో అమానవీయ ఘటన! షర్మిల హాట్ కాామెంట్స్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
అమావీయ ఘటన
ఒంగోలులో అమావీయ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం జరిగిన ఇష్యూ సోషల్ మీడియా పుణ్యమా అని హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఓ గిరిజన యువకుడిని కొందరు వ్యక్తులు కొట్టి నోటిలో మూత్ర పోషిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కారులో సీట్ల లొల్లి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ కాక మొదలైంది. అయితే రాష్ట్రంలో చాలామట్టుకు సిట్టింగ్‌లకే సీట్లు కేటాయిస్తామని, కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చుతామని, పనితీరు బాగాలేనివాళ్లు మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు, క్యాడర్‌కు అందుబాటులో ఉండాలని గులాబీ అధినేత కేసీఆర్ ఇదివరకే ఎమ్మెల్యేలకు పలుమార్లు సూచించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం తమ వైఖరి మార్చుకోవడం లేదు.. సరికదా, ఎన్నికలకు ముందు కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన క్యాడర్‌పై చిందులు తొక్కుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు.. పార్టీ పెద్దలకు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. సిట్టింగులకు సీట్లిస్తే తాము నష్టపోయేదేమీ లేదని, తమ నియోజకవర్గాల్లో పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలుగు రాష్ట్రాల్లో ముసురు
ఈ రోజు ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లాలోని ఒడిశా తీరంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకి వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఆవర్తన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పవన్ అడుగులు ఎటు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసే ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఖచ్చితంగా టీడీపీ కలసి వస్తుందని అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎన్డీఏ మీటింగ్ కు వెళ్లలేదు. తాము ఎన్డీఏలో కలుస్తామన్న సంకేతాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆహ్వానం వచ్చేది. కానీ బీజేపీ హైకమాండ్ ఏపీ విషయంలో చాలా గందరగోళంగా ఉంది. వైఎస్ఆర్‌సీపీతో ఉన్న రహస్య సంబంధాలను తెంచుకునేందుకు ఏ మాత్రం ఆసక్తిగా లేదు. కానీ అలాంటి లోపాయికారీ ఒప్పందాలు ఉంటే.. బీజేపీతో కలిస్తే అర్థం ఉండదని టీడీపీ తేల్చేసింది. దీంతో ఏపీలో కూటమి అనేది సస్పెన్స్ లో పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
షర్మిల ఘాటు వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ విషయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులదని అన్నారు. మండుటెండల్లో మత్తడి పారుతుందని కేసీఆర్ దొంగ పండుగలు చేస్తుంటే.. నారుమడికైనా కాసిన్ని నీళ్ళు లేవనేది రైతుల వాదన అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రేవంత్ ఉంటేనే బీఆర్‌ఎస్‌కు మేలు
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేసులోకి వచ్చిందని.. ఆ పార్టీ నేతలు సంబర పడుతున్నారు . బీజేపీ వెనక్కి వెళ్లిపోయిందని.. తాము బలపడ్డామని అనుకుంటున్నారు. వారు అలా అనుకోవడం కామనే. ఎందుకంటే పీసీసీ చీఫ్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి. విచిత్రంగా బీఆర్ఎస్ నేతలు కూడా అదే అనుకుంటున్నారు. ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనే ఉంటే బీఆర్ఎస్ కు వంద సీట్లు వస్తాయని అనుకుంటున్నారు.రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మణిపూర్‌ను ఆదుకోవాలని వినతి
సుమారు మూడు నెలలుగా ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను ఆదుకోవాలని, ఇకనైనా తమ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ప్రముఖ వెయిట్ లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కోరింది. సోమవారం ఆమె తన ట్విటర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేస్తూ.. మూడు నెలలుగా మణిపూర్‌లో ఘర్షణల్లో కాలిపోతున్నదని, ఇకనైనా తమను ఆదుకోవాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సహారా బాధితులకు గుడ్‌న్యూస్
కష్టపడి సంపాదించిన డబ్బును సహారా ఇండియాలో పెట్టి, దానిని తిరిగి పొందడానికి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న సహారా బాధితులకు గుడ్‌న్యూస్. డిపాజిటర్లందరికీ త్వరలోనే డబ్బును తిరిగి వస్తుంది. కేంద్ర మంత్రి అమిత్ షా CRCS సహారా రిఫండ్ పోర్టల్ (CRCS Sahara Refund Portal) లాంచ్ చేశారు. సహారా గ్రూప్ కో-ఆపరేటివ్ సొసైటీల్లో డిపాజిట్స్ చేసిన కోట్లాది మంది సొమ్ము ఈ వెబ్‌సైట్ ద్వారా 45 రోజుల్లో తిరిగి వస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
విపక్ష కూటమిపై హిమంత్ సెటైర్లు
బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విపక్షాల కూటమి సమావేశంపై విమర్శలు చేశారు. విపక్షాల కూటమి రెండో రోజు సమావేశంలో భాగంగా మంగళవారం తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు. దేశ సంస్కృతి, నాగరికత వైరుద్ధ్యం భారత్, ఇండియా మధ్య ఉందన్నారు. మన దేశాన్ని కలోనల్ లెగసీ నుంచి విముక్తి కల్పించాలని అభిప్రాయపడ్డారుపూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కల్ట్ ఇప్పుడిదే ట్రెండ్
ఇప్పుడు టాలీవుడ్ లో 'కల్ట్' అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. 'కల్ట్ సినిమా' అందించామని 'బేబీ' చిత్ర నిర్మాతలు చెబుతుంటే.. 'యునిక్ కల్ట్ మూవీ' తీశామని 'హిడింబ' మేకర్స్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు కల్ట్ సినిమా అంటే ఏంటి? ఎలాంటి చిత్రాలని ఆ జాబితాలో చేరుస్తారు? అంటూ 'కల్ట్' గురించే ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి