Vallabhaneni Vamsi Remand: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్.. చేజేతులా A1గా మారిన వైనం
Andhra Pradesh News | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి 14 రోజుల రిమాండ్ విధించారు. చేజేతులా A71 నుండి A1 గా మారారని వైరల్ అవుతోంది.

Vallabhaneni Vamsi Arrest News Updates | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. ఆయనతోపాటు A7 శివ రామకృష్ణ, A8 నిమ్మా లక్ష్మీపతి కి కూడా రిమాండ్ విధించడంతో వీరిని జిల్లా కోర్టుకు తరలించారు. గన్నవరం టిడిపి ఆఫీసు ధ్వంసం కేసులో పిటిషనర్ సత్య వర్ధన్ ను కిడ్నాప్, దాడి సహా అట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చిన ఏపీ పోలీసులు 8 గంటలపైగా విచారించారు. అనంతరం మెడికల్ టెస్ట్ లు పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి వల్లభనేని వంశీ సహా ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.
చెజేతులా A71 నుండి A1గా మారిన మాజీ ఎమ్మెల్యే వంశీ
కేసు వివరాల్లోకి వెళితే 2019లో రెండోసారి గన్నవరం ఎమ్మెల్యే గా టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పార్టీకి దూరం కావడం ప్రారంభించారు. టిడిపికి రాజీనామా చేసి వైసీపీ కి మద్దతు దారుగా అసెంబ్లీలో కొనసాగారు. అప్పటినుంచి గన్నవరం లో టీడీపీ కార్యకర్తలకు వంశీ వర్గానికీ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నడుస్తుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి పై దుర్భాషలాడిన ఆరోపణ వంశీ పై ఉంది. అప్పటినుంచి టిడిపికి వంశీకి మధ్య పీక్ కి వెళ్లిపోయాయి. వీటన్నిటి నేపథ్యంలో గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి జరిగింది. అందులో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటుగా లోపల ఉన్న సిబ్బందిపై కూడా దాడి జరిగిందని ఆఫీసులో డిటిపి ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్య వర్ధన్ ఎడిషన్ దాఖలు చేశారు. దానిలో వల్లభనేని వంశీ పేరు A71గా ఉంది.
టీడీపీ అధికారంలోకి రావడంతో కంగారు పడ్డ వంశీ
2024 లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ అరెస్టు అవుతారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ కేసు విచారణ నెమ్మదిగా సాగింది. ఈలోపు ఎన్నికలకు ముందే భువనేశ్వరి కి సారీ చెప్పిన వంశీ ఎన్నికల ఫలితాలు తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారనేది కొత్తగా చేరిన వైసీపీ శ్రేణులకు సైతం తెలియలేదు. ఇలాంటి తరుణంలోనే కంగారుపడిన వంశీ పొరబాటు చేశారు. మూడు రోజుల క్రితం టిడిపి ఆఫీసు ధ్వంసం కేసులో పిటీషనర్ సత్య వర్ధన్ SC St అట్రాసితే ప్రత్యేక కోర్టుకు హాజరై తనకు ఆ గొడవ గురించి ఏమీ తెలియదంటూ ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. దానితో అందరూ షాక్ కు గురయ్యారు. ఇష్యూని పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేయడంతో వల్లభనేని వంశీ పిటిషనర్ సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేయించి, బెదిరించి, డబ్బులు ఆశ చూపించి కేసు వెనక్కి తీసుకునేలా చేశారని గుర్తించినట్టు టిడిపి చెబుతోంది.
ఈ కిడ్నాప్, బెదిరింపు మొదలైన ఆరోపణలతో కొత్త కేసులు నమోదు చేసి వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆయన్ను విజయవాడ తీసుకుని వచ్చి 8 గంటల పాటు విచారించిన పోలీసులు ఆయనతోపాటు నిమ్మా లక్ష్మీపతి, శివ రామకృష్ణ లను సైతం జడ్జి ముందు హాజరు పరిచారు. ఇవి నాన్ బెయిలబుల్ కేసులు కావడంతో జడ్జి పోలీసుల వాదనతో ఏకీభవించి నిందితులు ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా నిందితులని విజయవాడ జైలుకు తరలించారు. నిజానికి పాత కేసులో ఏ 71 గా ఉన్న వల్లభనేని వంశీ తన దుందుడుకు చర్యల కారణంగా కొత్త కేసులో A1 గా మారిపోవడం స్వయంకృతాపరాదమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

