అన్వేషించండి
Advertisement
Top Headlines Today 6th September 2024 : ముంపు బాధితులకు విరాళాలు ఇచ్చిన వాళ్లకు పవన్ అభినందనలు- మరో రికార్డు సృష్టించిన కోహ్లీ - మార్నింగ్ టాప్ న్యూస్
6th September 2024 News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
6th September 2024 News Headlines:
ఆంధ్ర పదేశ్ వార్తలు:
- ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదల వలన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 33 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మృతి చెందగా.. వీరిలో ఇద్దరు వరద నీటిలో గల్లంతయ్యారు. ఇక గుంటూరు జిల్లాలో 7గురు మృతి చెందగా.. పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. లక్షల ఎకరాల్లో పంటలు వరద నీళ్లపాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
- తెలుగు రాష్ట్రాల్లో ముంపు బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వరద బాధితులకు అండగా నిలుస్తున్న వారికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సిద్ధు జొన్నల గడ్డ, సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలంటూ పవన్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణ వార్తలు :
- తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై రాష్ట్ర హైకోర్టు సెప్టెంబరు 5న కీలక తీర్పు వెలువరించింది. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని ధర్మాసనం స్పష్టంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
- తెలంగాణలో త్వరలో 6వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యకు తమ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసిందని చెప్పారు. గత పదేళ్లు డీఎస్సీ ఊసే లేదని.. తాము అధికారంలోకి రాగానే 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
- తెలంగాణలో తిరిగే ఆర్టీసీ బస్‌లలో పూర్తిస్థాయిలో డిజిటల్ విధానం తీసుకొచ్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. బస్‌పాస్‌లు కూడా డిజిటల్ విధానంలో ఇవ్వాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జాతీయ వార్తలు:
- బీజేపీపై రైతుల్లో వ్యతిరేక ప్రచారాన్ని తీసుకొస్తున్నార... విపక్షాలు ప్రణాళికాబద్దంగా ఇది చేస్తున్నాయా? రాబోయే ఎన్నికల్లో వీటి ప్రభావం ఎంత ఉంటుంది. బీజేపీ కాన్ఫిడెంట్ కు కారణాలేంటీ?. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
- పదోతరగతి అర్హతతోనే 39481 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర భద్రత బలగాల్లో పని చేయాలనుకునే వాళ్లకు మంచి ఛాన్స్. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
- ఈ-కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఫెస్టివ్ సీజన్‌లో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
క్రీడావార్తలు
- భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 66 కోట్ల రూపాయల పన్ను కట్టి ఈ రికార్డు సొంత చేసుకున్నాడు. ఆయన క్రికెట్ ద్వారానే కాకుండా పెట్టుబడులు, వ్యాపారాలు, బ్రాండ్ వాల్యూ మీద కూడా భారీగానే ఆర్జిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సినిమా వార్తలు
- ‘ఆహా‘ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ ఫినాలేకి సిద్ధమైంది. ఇందులో పాల్గొని ఫైనల్స్‌కు వచ్చిన కంటెస్టెంట్లను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభినందించారు. ఇందులో పాల్గొన్న నసీరుద్దీన్, భరత్‌కు 'OG' సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హెల్త్ టిప‌్
- వంకాయల్లో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెకు రక్షణగా నిలుస్తాయి. రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వంకాయలు తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వంకాయలు తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. కాబట్టి రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
- నేటి ప్రత్యేకత
- రసాయనశాస్త్ర పితామహుడు జాన్ డాల్టన్ జయంతి
- జపనీస్ సినీ దర్శకుడు అకీరా కురొసావా వర్థంతి
- బుల్లితెర రచయిత, నటుడు, దర్శకుడు చెరుకూరి సుమన్ వర్థంతి
మంచిమాట
- నేటి బాలలే.. రేపటి పౌరులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion