అన్వేషించండి

BJP Farmers Policy : బీజేపీకి 7 పథకాల బలం - రైతుల్లో మార్పు - విపక్షాల వ్యతిరేక ప్రచారం గ్రౌండ్ లెవల్లో రివర్స్ అయిందా ?

BJP : భారతీయ జనతా పార్టీపై కొంత కాలంగా రైతు వ్యతిరేక ప్రచారాన్ని విపక్షాలు ప్రణాళికాబద్దంగా చేస్తున్నాయి. ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎంత ఉంటుంది ? బీజేపీ ఎందుకు కాన్ఫిడెంట్ గా ఉంది ?

BJP has the support of farmers in Haryana :  రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చినప్పటి నుండి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రైతు వ్యతిరేకత ముద్ర వేసేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నించాయి. ఆ చట్టాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రాలేదు. కొన్ని రాష్ట్రాల్లోనే వచ్చింది. అయితే రైతులకు ఆ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమైన  బీజేపీ చివరికి రాజకీయంగా నష్టం జరగకుండా ఆ చట్టాలన వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సత్ఫలితాలను పొందింది. ఇప్పుడు మరోసారి రైతుల విషయంలో  బీజేపీ ని టార్గెట్ చేస్తూ.. హర్యానా ఎన్నికల్లో బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలను బీజేపీ తేలికగా తీసుకోలేదు. వారికి కౌంటర్ ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా చాపకింద నీరులా వ్యూహాలు పన్నింది. ఆ ఫలితాలు ఎన్నికల్లో కనిపిస్తాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.  విపక్షాల రైతు వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టామని భావిస్తోంది. ఇంతకీ బీజేపీ ఏం చేసింది ? 

రైతులు, వ్యవసాయం కోసం బీజేపీ పక్కా ప్రణాళికలు

రైతులకు అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ తో  పాటు ఇండీ కూటమి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఏ అన్యాయం  కేంద్రం చేసిందో మాత్రం చెప్పడం లేదు. రైతులకు అలాంటి ఆలోచన లేకుండా రోడ్ల మీదకు వచ్చేలా చేస్తే రాజకీయంగా లాభమని ఇండీ  కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం  ఫార్మర్ సెంట్రిక్ విధానాలను సైలెంట్ గా అమలు చేస్తూ రైతుల ఆదాయంలో మెరుగుదలను చూపిస్తోంది. దాన్ని రైతులు తెలుసుకునేలా చేస్తోంది. ఇది చాపకింద నీరులాగా జరిగిపోతోంది. ఇండీకూటమి పార్టీలు పైపై ఆందోళనలు చేస్తూ.. రాజకీయ బలంతో చేసే ఆందోళనలు తటస్థ రైతులపై ఏ మాత్రం ప్రభావం చూపవని బీజేపీ నమ్మకంతో ఉంది.  

ఏడు కొత్త పథకాలతో టెక్ అగ్రికల్చర్ వైపు వ్యవసాయ రంగం

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంది. మద్దతు ధరలను రైతులు కూడా ఊహించనంత ఎక్కువగా పెంచుతూ వస్తోంది. రైతు చట్టాల విషయంలో ...రైతల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించలేకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా వెనక్కి తీసుకున్నా..రైతులకు ప్రత్యేక పథకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. పీఎం కిసాన్, ఫసల్ బీమా వంటి పథకాలు రైతులకు ఎంతగా మేలు చేస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు . తాజాగా రూ.  13,966 కోట్లతో ఏడు కీలక పథకాలకు ఆమోదం ఏడు కొత్త పథకాలకు ఆమోదం తెలిపారు. ఇందులో  డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కి 2,817 కోట్లు కేటాయించారు.

7 స్కీమ్స్‌కు రూ. 14 వేల కోట్ల కేటాయింపు

రైతుల జీవితాలు, వారికి మరింత మెరుగైన జీవనోపాధిని కల్పించే లక్ష్యంతో ఈ  ఏడు ప్రధాన పథకాలను అమల్లోకి తెచ్చారు.  రైతుల పట్ల కేంద్రం ఎంత శ్రద్ధ చూపుతోందో కొత్తగా ఆమోదించిన ఏడు పథకాలను బట్టి అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం .. వ్యవసాయ రంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.   వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి  కృత్రిమ మేధస్సు, బిగ్ డేటా, జియోస్పేషియల్ టెక్నాలజీలతో సహా అత్యాధునిక సాంకేతికతను అన్వయించడానికి ఏర్పాట్లు చేస్తోంది.  వ్యవసాయ డేటాను సమగ్రంగా డిజిటల్ రిపోజిటరీ చేయడం, అగ్రి స్టాక్‌ను రూపొందించడం, రైతుల రిజిస్ట్రేషన్, విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ రిజిస్ట్రేషన్ వంటివి ఏర్పాటు చేసి సాంకేతిక వ్యవసాయంగా మార్చి..రైతుల పంట పండించాలని సంకల్పించారు. 

బాగుపడుతున్న పరిస్థితులపై హర్యానా రైతుల్లో చర్చ 

రైతులను కొనుగోలుదారులతో నేరుగా అనుసంధానం చేయడాన్ని ఓ టార్గెట్ గా పెట్టుకున్నారు. రైతులు నేరుగా వినియోగదారులకు అమ్ముకునేలా ప్రోత్సహం ఇవ్వనున్నారు.  వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా  రైతులను సిద్ధం  చేసేందుకు ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నారు. ఇందు కోసం రూ. 2,291 కోట్లు కేటాయించారు.  పశుపోషణ, ఉత్పత్తి పథకానికి 1,702 కోట్లు కేటాయించారు.  ఉద్యానవనాల అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ కోసం రూ. 860 కోట్ల రూపాయలను కేటాయించారు.  సహజ వనరుల నిర్వహణ పథకం కింద 1,115 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం చేపట్టిన చర్యల వల్ల పదేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు తమ ఆదాయంలో వచ్చిన గణనీయమైన మార్పులు రైతులు గుర్తిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది హర్యానా ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని నమ్ముతున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Cm Revanth Reddy : మహిళా సంఘాలకు గుడ్ న్యూస్-  రెండేసి చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్- రెండేసి చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు  
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
Stock Market Holiday: ఈ రోజు స్టాక్‌ మార్కెట్లకు హాలిడేనా? డౌట్‌ తీర్చుకోండి
ఈ రోజు స్టాక్‌ మార్కెట్లకు హాలిడేనా? డౌట్‌ తీర్చుకోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABPఎన్టీఆర్‌ని స్టార్‌నీ దేవుడ్నీ చేసిన లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డిసిద్దరామయ్య ఈవెంట్‌లో భద్రతా లోపం, సీఎం వైపు దూసుకొచ్చిన యువకుడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Cm Revanth Reddy : మహిళా సంఘాలకు గుడ్ న్యూస్-  రెండేసి చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్- రెండేసి చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు  
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
Stock Market Holiday: ఈ రోజు స్టాక్‌ మార్కెట్లకు హాలిడేనా? డౌట్‌ తీర్చుకోండి
ఈ రోజు స్టాక్‌ మార్కెట్లకు హాలిడేనా? డౌట్‌ తీర్చుకోండి
Singer Chinmayi Sripada: రోహిణి కమిటీపై చిన్మయి కామెంట్స్... లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తులను ఏం చేయలేరంటూ
రోహిణి కమిటీపై చిన్మయి కామెంట్స్... లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తులను ఏం చేయలేరంటూ
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Saripodhaa Sanivaaram: 100 కోట్ల క్లబ్‌లో 'సరిపోదా శనివారం' - నాని జైత్రయాత్రలో మరో భారీ బ్లాక్‌ బస్టర్
100 కోట్ల క్లబ్‌లో 'సరిపోదా శనివారం' - నాని జైత్రయాత్రలో మరో భారీ బ్లాక్‌ బస్టర్
Atchannaidu: అధికారులకు ముచ్చెమటలు పట్టించిన మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ సర్కార్ కాదంటూ వార్నింగ్
అధికారులకు ముచ్చెమటలు పట్టించిన మంత్రి అచ్చెన్నాయుడు, ఇది వైసీపీ సర్కార్ కాదంటూ వార్నింగ్
Embed widget