అన్వేషించండి

Telugu News: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ కొలువులు, 39481 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

Constable Recruitment: కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌ మ్యాన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC Constable GD Notification 2025: కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సెప్టెంబరు 5న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 39,481 ఖాళీలను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో పురుషులకు 35,612 పోస్టులు; మహిళలకు 3,869  పోస్టులు కేటాయించారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 15,654 పోస్టులు; సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 7,145 పోస్టులు; సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 11,541 పోస్టులు; సశస్త్ర సీమాబల్‌(SSB)లో 819 పోస్టులు; ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,017 పోస్టులు; అస్సాం రైఫిల్స్(AR)లో 1,248 పోస్టులు; స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 35  పోస్టులు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 22 పోస్టులు ఉన్నాయి. 

ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైంది. అక్టోబరు 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అక్టోబరు 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. దరఖాస్తుల సవరణకు నవంబరు 5 నుంచి 7 వరకు అవకాశం కల్పించనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 భారతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు. 

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 39,481

పోస్టుల కేటాయింపు: యూఆర్-16,782, ఈడబ్ల్యూఎస్-3851, ఓబీసీ-8576, ఎస్టీ-4454, ఎస్సీ-5818.

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 15,654 మెన్-13306, ఉమెన్-2348
సీఐఎస్‌ఎఫ్‌ 7,145 మెన్-6430, ఉమెన్-715
సీఆర్‌పీఎఫ్‌ 11,541 మెన్-11299, ఉమెన్-242
ఎస్‌ఎస్‌బీ 819  మెన్-819, ఉమెన్-0
ఐటీబీపీ 3,017 మెన్-2564, ఉమెన్-453
ఏఆర్ 1,248 మెన్-1148, ఉమెన్-100
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 35  మెన్-35, ఉమెన్-0
ఎన్‌సీబీ 22 మెన్-11, ఉమెన్-11
మొత్తం ఖాళీలు 39,481 39,481

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఎన్‌సీసీ ఉన్నవారికి వెయిటేజీ వర్తిస్తుంది.

వయోపరిమితి: 01-01-2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. 02.01.2002 - 01.01.2007 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్-3 సంవత్సరాలు, అల్లర్లలో భాదిత కుటంబాలకు చెందిన అభ్యర్థులకు  5 - 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

రాత పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంటలిజెన్స్‌ & రీజనింగ్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవర్‌నెస్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు. 

జీతం: ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఎన్‌సీబీలో సిపాయ్ పోస్టులకు పేలెవల్-1(రూ.18,000 - రూ.56,900), ఇతర పోస్టులకు పేలెవల్-3(రూ.21,700 -  రూ.69,100) కింద జీతభత్యాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 05.09.2024.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 14.10.2024 (23:00)

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 15.10.2024 (23:00)

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 05.11.2024 - 07.11.2024 (23:00)

➥ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: జనవరి - ఫిబ్రవరి, 2025.

Notification

OnLine Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget