Flipkart Jobs: నిరుద్యోగులకు ఈ-కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' గుడ్ న్యూస్, త్వరలో లక్ష ఉద్యోగాల భర్తీ
Flipkart Jobs: ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. రానున్న ఫెస్టివ్ సీజన్‌లో ఏకంగా లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు సన్నద్ధమవుతోంది.

Flipkart creating 1 lakh jobs before festive season: దేశంలోని నిరుద్యోగ యువతకు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ సిద్దమవుతోంది. రాబోయే ఫెస్టివల్ సీజన్లో నిర్వహించే 'బిగ్ బిలియన్ డేస్ సేల్' కోసం దేశీయంగా లక్ష ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఈ మేరకు ప్రకటించింది. దేశ ఆర్థికవృద్ధికి ఊతమివ్వడంలో భాగంగా ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా సప్లయ్ చైన్ విభాగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ సీజన్లో అధిక డిమాండ్ ఉంటుంది. డిమాండ్‌కు తగినట్లుగా సప్లయ్ చేసేందుకు సిబ్బంది అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్లిప్ కార్ట్ దేశవ్యాప్తంగా 9 నగరాల్లో కొత్తగా 11 పుల్ఫిల్మెంట్ సెంటర్లను ప్రారంభించింది. కొత్త కేంద్రాలతో దేశవ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్ కోసం 83 పుల్ఫిల్ మెంట్ సెంటర్లు ఉన్నాయి. వీటిద్వారా ఈ పండగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు స్థానిక కమ్యూనిటీకి ఉపాధి లభిస్తాయని తెలిపింది. దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ విభాగాల్లో ఉద్యోగాలు..
సప్లయ్ చైన్ విభాగంలో ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్ హౌస్ అసోసియేటర్లు, లాజిస్టిక్స్ కో-ఆర్డినేటర్లు, కిరాణా పార్ట్‌నర్లు, డెలివరీ డ్రైవర్లతో సహా వివిధ సప్లయ్ చైన్ వర్టికల్ సిబ్బందిని నియ మించుకోనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. సమర్థవంతమైన, స్థిరమైన చైన్ సప్లయ్ సిస్టమ్ ద్వారా కస్టమర్ల అవసరాలను తీర్చడంతోపాటు సిబ్బంది ఆర్థికాభివృద్దికి అవకాశాలను కల్పించడం ద్వారా సంస్థ అభివృద్ది పథంలో నడిపించాలని కోరుకుంటున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు.
వీరికి ప్రాధాన్యం..
నియామకాల్లో మహిళలు, దివ్యాంగులు, ఎల్‌జీబీటీక్యూఏఐ కమ్యూనిటీకి చెందిన వారికి ప్రాధాన్యమివ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ సంస్థ తెలిపింది. కొత్తగా ఉద్యోగాల్లో తీసుకునే వీరికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. సాధారణంగా పండగల వేళ ఇ-కామర్స్ కంపెనీలు ప్రకటించే ఈ ఉద్యోగాలు సీజనల్‌గా ఉంటాయి. ఏటా ఈ తరహా నియామకాలను చేపడుతూ ఉంటాయి. ఈ-కామర్స్ కామర్స్ ఆఫ్లైన్ రిటైల్ రంగాన్ని దెబ్బతీస్తుందని, కిరాణా స్టోర్లతోసహా చిన్న రిటైలర్లను తీవ్రప్రభావానికి గురి చేస్తుందని ప్రచారం జరుగుతున్న క్రమం లో ఫ్లిప్కార్ట్ నియామకాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

