Vijayawada News: విజయవాడలో కేంద్ర మంత్రి చౌహాన్ పర్యటన, వరదల నష్టంపై ఏరియల్ సర్వే
AP News: విజయవాడలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే చేశారు. బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
Shivraj Singh Chauhan: వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు. ఈయనకు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా కేంద్ర మంత్రి పరిశీలించారు.
మంత్రి నారా లోకేష్ ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్ కు ఇద్దరు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్డీఆర్ఎఫ్ బోట్‌లో కూర్చొని కేంద్ర మంత్రి చౌహాన్, మంత్రి లోకేశ్ పరిశీలించారు.
విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి చౌహాన్ తిలకించనున్నారు. వరద నష్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కేంద్రమంత్రి చౌహాన్ సమీక్ష నిర్వహించనున్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించి, నివేదికలు వివిధ శాఖల ఉన్నతాధికారులు అందజేయనున్నారు.