Top Headlines Today: బాబు-పవన్ డిన్నర్ మీటింగ్?; మల్కాజిగిరి కోసం బీజేపీలో లొల్లి - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిన్నర్ మీటింగ్!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా భేటీ అయ్యారు. తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. శనివారం డిన్నర్ మీట్ లో భాగంగా చంద్రబాబు, పవన్ భేటీ కాగా, ఇందులో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు. ఇరు పార్టీల కీలక నేతల భేటీ కావడంతో టీడీపీ, జనసేన.. ఉమ్మడి మేనిఫెస్టోపైన, సీట్ల పంపిణీ పైన చర్చించే అవకాశం ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో, ఎక్కడెక్కడ నుండి బరిలోకి దిగాలి అని కీలకంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఇంకా చదవండి
వైసీపీకి మచిలీపట్నం ఎంపీ రాజీనామా
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రెండు, మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ ను కలిసి జనసేనలో చేరే అవకాశం ఉంది. బాలశౌలి సీఎం జగన్ కు సన్నిహితుడు. వ్యాపార భాగస్వామిగా ప్రచారం ఉంది. వైఎస్ హయాంలోనూ ఆయన ఓ సారి ఎంపీగా ఉన్నారు. స్థానికేతుడు అయినప్పటికీ మచిలీపట్నం సీటు ఇచ్చి ఎంపీగా గెలిపించారు. ఇటీవల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో విందు ఇచ్చారు. ఈ విందుకు వెళ్లిన వారిలో బాలశౌరి ఉన్నారు. ఇంకా చదవండి
నూతన పారిశ్రామిక కారిడార్ ను ఆమోదించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వయా మిర్యాలగూడ - విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ (Hyderabad - Vijayawada industrial corridor ) ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్- నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా చదవండి
మల్కాజిగిరి కోసం బీజేపీలో లొల్లి
భారతీయ జనతా పార్టీలో మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్ కోసం భారీ రేస్ జరుగుతోంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ కార్యక్రమాలతో కొంతమంది ప్రజల్లోకి వెళ్తుండగా.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మరికొందరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ ఎవరికీ ఇంకా సంకేతాలు ఇవ్వలేదు. ఇంకా చదవండి
పరీక్షల భయమా? ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి తేదీ ఖరారైంది. జనవరి 29న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ జనవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల సమయం దగ్గరపడుతున్న ప్రస్తుత సమయంలో.. విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టిసారించలేక ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఇంకా చదవండి
ఈ 16న ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. పాలసముద్రంలోని నాసిన్ కేంద్రం వద్ద హెలిప్యాడ్, వాహనాల రాకపోకల, పలు ఏర్పాట్లపై అడ్వాన్స్ సెక్యూరిటీ లాంచ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇంకా చదవండి
4 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం
గత ఏడాది (2023) డిసెంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం డేటా మళ్లీ భయపెట్టింది. డిసెంబర్‌లో, వినియోగ ధరల సూచీ (Consumer Price Index) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) నెల వ్యవధిలో 0.14 శాతం పెరిగింది. 2023 నవంబర్‌లోని 5.55 శాతం నుంచి డిసెంబర్‌లో 5.69 శాతానికి చేరింది. అంతకుముందు అక్టోబర్ నెలలో ఇది 4.87 శాతంగా ఉంది. కూరగాయలతోపాటు ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల చిల్లర ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంకా చదవండి
'గుంటూరు కారం' రివ్యూస్‌పై 'దిల్' రాజు ఫస్ట్ రియాక్షన్ - ఏమన్నారంటే..
త్రివిక్రమ్ శ్రీనివాస్-సూపర్ స్టార్ కాంబినేషన్ తెరకెక్కిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇండస్ట్రీ హిట్ అనుకున్న ఈ సినిమాకు కాస్తా నెగిటివ్ రివ్యూస్ వినిపించడంతో ఫ్యాన్స్, ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అంతేకాదు గుంటూరు కారంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ మిమ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా గుంటూరు కారం రిజల్ట్‌పై ఈ మూవీ నిర్మాత నాగవంశీ నైజాం, ఉత్తరాంధ్ర డిస్ట్రీబ్యూటర్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఇంకా చదవండి
వెంకటేష్ 'సైంధవ్' ఓటీటీ పార్ట్‌నర్ ఎదో తెలుసా? ఆ పండుగకు స్ట్రీమింగ్!
'విక్టరి' వెంకటేష్ లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. ఇది ఆయనకు మైల్‌స్టోన్ మూవీ. వెంకటేష్ 75వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకు 'హిట్' ఫేం శైలేష్ కోలను దర్శకత్వం వహించారు. ఈసినిమాలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటించారు. వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన సైంధవ్‌పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య నేడు థియేటర్లోకి వచ్చిన ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పటికే 'గుంటూరు', 'హనుమాన్' చిత్రాల పోటీ ఉండగా వాటిని తట్టుకుని 'సైంధవ్' ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. ఇంకా చదవండి
సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన, ఆదివారం అఫ్గాన్‌తో రెండో టీ 20
టీ-20 ప్రపంచకప్‌నకు ముందు మిగిలిన చివరి టీ-20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భారత్(Bharat) పట్టుదలగా ఉంది. మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇందౌర్( Indore) వేదికగా అఫ్గానిస్తాన్(Afghanistan)తో రెండో మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను గెలవాలని రోహిత్ సేన భావిస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి టీ-20కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) రెండో మ్యాచ్‌కు జట్టుతో కలవనున్నాడు. ఇంకా చదవండి