అన్వేషించండి

Revanth Reddy: నూత‌న పారిశ్రామిక కారిడార్ ను ఆమోదించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విన‌తి

Hyderabad Vijayawada industrial corridor: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా హైద‌రాబాద్ వ‌యా మిర్యాల‌గూడ - విజ‌య‌వాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరారు.

Revanth Reddy Visits Delhi: న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌ తో భేటీ అయ్యారు. హైద‌రాబాద్ వ‌యా మిర్యాల‌గూడ - విజ‌య‌వాడ నూతన పారిశ్రామిక కారిడార్ (Hyderabad - Vijayawada industrial corridor ) ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు విజ్ఞ‌ప్తి  చేశారు. హైద‌రాబాద్‌- నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమ‌తులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుద‌లవుతాయ‌న్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఆయన కార్యాల‌యంలో శ‌నివారం స‌మావేశ‌మ‌య్యారు.  ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌ను ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 
గత ప్రభుత్వ ప్రతిపాదన ఉపసంహరణ
హైద‌రాబాద్‌- వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో  ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గ‌త ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింద‌ని, దానిని ఉప సంహ‌రించుకొని నూత‌న ప్ర‌తిపాద‌న‌లు పంపేందుకు అనుమ‌తించాల‌ని  కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.  యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్‌కు నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్ (ఎన్ఐడీ) మంజూరు చేసింద‌ని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శ‌ర్మ దానికి శంకుస్థాప‌న చేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి గోయ‌ల్‌కు గుర్తు చేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఎన్ఐడీని విజ‌య‌వాడ‌కు త‌ర‌లించార‌ని, ఈ క్రమంలో తెలంగాణ‌కు ఎన్ఐడీ మంజూరు చేయాల‌ని కోరారు.  ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెద‌ర్ పార్క్ మంజూరు చేసింద‌ని కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి అన్నారు.


Revanth Reddy: నూత‌న పారిశ్రామిక కారిడార్ ను ఆమోదించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విన‌తి

లెద‌ర్ పార్క్ మంజూరు చేస్తే భూమి కేటాయింపులకు రెడీ
క‌రీంన‌గ‌ర్‌, జ‌న‌గాం జిల్లాల్లో లెద‌ర్ పార్క్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూములున్నాయ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం మెగా లెద‌ర్ పార్క్ మంజూరు చేస్తే వెంట‌నే భూమి కేటాయిస్తామ‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలిపారు.  ఇది మంచి ప్ర‌తిపాద‌న అని, ఇందుకు సంబంధించిన అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి స‌మావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారుల‌కు సూచించారు. కేంద్ర ప్ర‌భుత్వం పీఎం మిత్ర ప‌థ‌కంలో భాగంగా వ‌రంగ‌ల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చింద‌ని, దానికి గ్రీన్‌ఫీల్డ్ హోదా ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థించారు. బ్రౌన్‌ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్‌కు మార్చితే పార్క్‌కు గ్రాంట్ల రూపంలో అద‌నంగా రూ.300 కోట్ల నిధులు వ‌స్తాయ‌ని, ఇది అక్క‌డి ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  
తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం
టెక్నిక‌ల్ టెక్స్ టైల్స్ (బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, క‌న్వేయ‌ర్ బెల్టులు, ఎయిర్ బ్యాగ్‌లు త‌దిత‌రాలు) టెస్టింగ్ సెంట‌ర్ల ఏర్పాటుకు  సుముఖంగా ఉన్నామని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌న్నారు. ఈ విష‌యంలో తెలంగాణ ఇప్ప‌టికే సంసిద్ధ‌త వ్య‌క్తం చేసినందున రాష్ట్రానికి Centre of excellence for Technical Textiles/టెస్టింగ్ సెంట‌ర్ మంజూరు చేయాల‌ని కోరారు. తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (IIHT) మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కోరారు. 

Revanth Reddy: నూత‌న పారిశ్రామిక కారిడార్ ను ఆమోదించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విన‌తి
రాష్ట్రంలో ఏడు చేనేత క్లస్టర్స్ ఉన్నాయని, ఐఐహెచ్ మంజూరు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఐఐహెచ్‌టీ ఎక్స్‌టెన్ష‌న్ సెంట‌ర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి సానుకూల‌త వ్య‌క్తం చేశారు.  కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల నుంచి కేంద్రానికి  రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుద‌ల చేయాల‌ని, రాష్ట్ర అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రాభివృద్ధికి స‌హ‌క‌రిస్తామ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ అన్నారు.  తెలంగాణ రేవంత్ రెడ్డి, డిప్యూటీ భ‌ట్టి విక్ర‌మార్క‌ల‌కు కేంద్ర మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. స‌మావేశంలో కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి బాలాజీ, కేంద్ర జౌళి శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి రోహిత్ క‌న్స‌ల్‌, రాష్ట్ర జౌళి, చేనేత శాఖ డైరెక్ట‌ర్ అలుగు వ‌ర్షిణి, టీఎస్ఐఐసీ సీఈవో మ‌ధుసూద‌న్‌, ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్ ఓఎస్డీ సంజ‌య్ జాజు,  రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Crime News: ఏపీలో దారుణాలు - సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్య, శ్రీకాకుళంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఏపీలో దారుణాలు - సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్య, శ్రీకాకుళంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget