Saindhav OTT Release: వెంకటేష్ 'సైంధవ్' ఓటీటీ పార్ట్‌నర్ ఎదో తెలుసా? ఆ పండుగకు స్ట్రీమింగ్! ఎప్పుడంటే..
Saindhav OTT Release: ఇప్పుడు 'సైంధవ్' ఓటీటీ పార్ట్‌నర్ పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు ఈ డిజిటల్ ప్లాట్ ఫాం ఫ్యాన్సీ ధరకు మూవీని దక్కించుకుంది.
Saindhav OTT Release: 'విక్టరి' వెంకటేష్ లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. ఇది ఆయనకు మైల్‌స్టోన్ మూవీ. వెంకటేష్ 75వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకు 'హిట్' ఫేం శైలేష్ కోలను దర్శకత్వం వహించారు. ఈసినిమాలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటించారు. వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన సైంధవ్‌పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య నేడు థియేటర్లోకి వచ్చిన ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పటికే 'గుంటూరు', 'హనుమాన్' చిత్రాల పోటీ ఉండగా వాటిని తట్టుకుని 'సైంధవ్' ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.
ఫ్యాన్సీ ఢీల్ కు 'సైంధవ్'!
ఇదిలా ఉంటే ఇప్పుడు 'సైంధవ్' ఓటీటీ పార్ట్‌నర్ ఏంటనేది డిజిటల్ ప్రియుల్లో క్యూరియసిటీ నెలకొంది. కరోనా తర్వాత థియేటర్లోకి వచ్చిన ప్రతీ సినిమా ఆ తర్వాత ఓటీటీకి వస్తుంది. దాంతో సినీ ప్రియులు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నారు. దీంతో సైంధవ్ ఓటీటీపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ వెంకీమామ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి రానుందని అంతా తెగ వెతికికేస్తున్నారు. ఈ క్రమంలో 'సైంధవ్' మూవీ ఓటీటీ పార్టనర్ వివరాలు లీక్ అయ్యాయి. ఈ మూవీ కోసం పలు దిగ్గజ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు అమెజాన్ ప్రైం ఫ్యాన్సీ ధరకు మూవీని దక్కించుకుందట. దీంతో 'సైంధవ్' రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. దీంతో వెంకీమామ మూవీ డిజిటల్ రైట్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
అయితే ఈ మూవీ నాలుగు లేదా ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుందట. లేదా మూవీ రిజల్ట్ బట్టి ఎప్పుడనేది మేకర్స్ నిర్ణయించనున్నారట. సో 'సైంధవ్' మూవీ నాలుగు వారాల తర్వాత ఎప్పుడైన ఓటీటీకి రావోచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాను ఫిబ్రవరిలో మహాశివరాత్రి సందర్భంగా స్ట్రీమింగ్ చేసే చాన్స్ కూడా ఉందంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే సైంధవ్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఈటీవీ విన్ కూడా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెరెమియా, హీరోయిన్ రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, జిషు సేన్‌గుప్తా, ముకేష్ రిషి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. సైంధవ్ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు.
'సైంధవ్' కథ ఏంటంటే..
ఈ సినిమాలో వెంకటేష్ సైకో సైంధవ్ పాత్రలో ఆకట్టుకున్నప్పటికీ కథ, నెరేషన్ రోటిన్‌గా ఉందని ఆడియన్స్ నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. సినిమా డిసప్పాయింట్ చేస్తుందని, విక్రమ్..జైలర్ తరహాలో కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో 'సైంధవ్' ఫెయిల్ అయ్యిందంటున్నారు. సైంధవ్ కోనేరు (వెంకటేష్) చంద్రప్రస్థలో పోర్ట్ ఉద్యోగి. అతడి పాప గాయత్రి (సారా పాలేకర్) అంటే అతనికి ప్రాణం. మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) క్యాబ్ డ్రైవర్. సైంధవ్ పక్కింట్లో ఉంటుంది. భర్త (గెటప్ శ్రీను) కొట్టడంతో అతడి మీద కేసు పెట్టి ఇంటికి వచ్చేస్తుంది. సైంధవ్ అంటే మనోజ్ఞకు ప్రాణం. అతని బిడ్డను తన కన్నకుతురిలా చూసుకుంటుంది. ఒక రోజు గాయత్రి ఉన్నట్టుండి కింద పడిపోతుంది. పాపకు ఎస్ఎంఏ వ్యాధి ఉందని, బతకాలంటే రూ. 17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయాలని డాక్టర్లు చెబుతారు. తన కూతురి బతికించుకోవడం సైంధవ్ ఏం చేశాడు.. డబ్బు వేటలో సైంధవ్ ఎదుర్కొన్న పరిణామాల చూట్టూ ఈ మూవీ సాగుతుంది.