Top Headlines Today: త్వరలో ఎస్సీ వర్గీకరణ-ప్రధాని; చలించిపోయిన ఏపీ మంత్రి రోజా - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
త్వరలో ఎస్సీ వర్గీకరణకు కమిటీ - ప్రధాని హామీ!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా త్వరలో ఓ కమిటీ వేస్తామని ప్రకటన చేశారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాదిగ విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ..ఈ కీలక ప్రకటన చేశారు. వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందున్నారు. 30ఏళ్లుగా మందకృష్ణ ఒకే లక్ష్ం కోసం పోరాడుతున్నారన్నారు. ఇంత కాలం మాటలు చెప్పి .. అమలు చేయని రాజకీయ పార్టీల తరపున తాను క్షమాపణ చెబుతున్నాన్నారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇంకా చదవండి
తెలంగాణలో పార్టీలకు ఈసీ షాక్, ఆ యాడ్స్ నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు!
తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలో ఎలక్షన్ షాకిచ్చింది. రాష్ట్రంలో అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు జారీ చేసింది. ఇకనుంచి పొలిటికల్ యాడ్స్ నిలిపివేయాలని మీడియాను ఈసీ ఆదేశించింది. అన్ని చానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ లేఖలు రాశారు. లీడర్లు ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తూ తమకు కావాల్సినట్లు ప్రకటనలు తయారుచేసి ప్రచారం చేసుకుంటున్నారని ఈసీ అధికారులు గుర్తించారు. ఇంకా చదవండి
నీట్ ర్యాంకర్ కష్టం చూసి చలించిపోయిన ఏపీ మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా అంటే రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఆమె ఎప్పుడూ రాజకీయాల్లో ఎలాగైతే తనదైన శైలిలో వార్తల్లో ఉంటారో అలాగే ఆమె వ్యక్తిగతంగా సేవా గుణంలో ఓ ప్రత్యేకత ఉంది. గతంలో తన నియోజకవర్గంలో చంద్రతేజ అనే వైద్య విద్యార్థి (MBBS Student) చదువులో టాపర్ కానీ ఆర్థికంగా ఫీజ్ కట్టుకోలేనని తన చదువుకి సాయం చెయ్యాలని చంద్రతేజ రోజాను సంప్రదించాడు. వెంటనే స్పందించిన మంత్రి రోజా (AP Minister Roja) చంద్రతేజ చదువు బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం చంద్రతేజ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంకా చదవండి
తిరుపతిలో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కలకలం! డోర్ తెరిచారో ఇక అంతే - పోలీసుల హెచ్చరిక
గతంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోసారి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తిరుపతి (Tirupati) జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang) సంచారంపై నిర్దారణకు వచ్చారు. తిరుపతి నగర, శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచరిస్తున్నట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఇంటి కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు కొట్టినా తెరవకూడదని అది చాలా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు. ఇంకా చదవండి
మస్కిటో కాయిల్స్ కాల్చకండి, మార్నింగ్ వాక్ మానేయండి - ఢిల్లీ వాసులకు ప్రభుత్వం సూచనలు
నగరవ్యాప్తంగా కాలుష్యాన్ని (Delhi Air Pollution) దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పౌరులకు కీలక సూచనలు చేసింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ కొన్ని మార్గదర్శకాలూ జారీ చేసింది. కలిసికట్టుగా ఈ సవాలుని దాటాలని సూచించింది. ఢిల్లీ పౌరులు మార్నింగ్ వాక్ చేయడం మానేయాలని తేల్చి చెప్పింది. దీంతో పాటు వ్యాయామమూ కొన్నాళ్ల పాటు మానేస్తే మంచిదని తెలిపింది. హెల్త్ ఎమర్జెన్సీని (Delhi Health Emergency) ఎదుర్కొంటున్న సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. స్థానికంగా అన్ని న్యూస్ పేపర్లలోనూ ఈ మార్గదర్శకాలు ప్రింట్ చేయించింది ఢిల్లీ ఆరోగ్య శాఖ. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలుష్య ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. గర్భంతో ఉన్న మహిళలు, వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడిన వాళ్లూ బయటకు రాకపోవడమే మంచిదని వివరించింది. ఇంకా చదవండి
బీజేపీ అధికారంలోకి వచ్చాక మత మార్పిడిని నిషేధిస్తాం, రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల (Chhattisgarh Election 2023) ప్రచారంలో పాల్గొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh). ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమను తాము హీరోగా ఫీల్ అవుతుందని, కానీ అదో జీరో పార్టీ అని మండి పడ్డారు. ఈ సమయంలోనే రాష్ట్రంలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వీటిని అరికట్టలేకపోతోందని ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక వీటిని కచ్చితంగా కంట్రోల్ చేస్తామని తేల్చి చెప్పారు. మత మార్పిడిపై నిషేధం విధిస్తామని స్పష్టం చేశారు. ఇంకా చదవండి
ఎన్టీఆర్ అభిమానులకు సారీ - హృతిక్ రోషన్ ఉన్నాడు కానీ?
బాలీవుడ్ సినిమా 'టైగర్ 3' కోసం టాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూడడానికి ఓ కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. సల్మాన్ ఖాన్ సినిమా అయినప్పటికీ... తెలుగులో మాస్ ప్రేక్షకుల వరకు 'టైగర్ 3' చేరింది. ఎందుకంటే... మన ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనువిందు చేస్తారని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరగడం! దానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఇంకా చదవండి
మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు
సీనియర్ కథానాయకుడు, నటుడు చంద్ర మోహన్ ఈ రోజు (నవంబర్ 11, శనివారం) ఉదయం 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయన కన్ను మూశారు. చంద్ర మోహన్ మరణంతో చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనను కడసారి చూసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు వెళుతున్నారు. ఇంకా చదవండి
టీవీ, ఏసీ, ఫ్రిజ్ కొనాలనే ఆలోచన ఉన్న వారికి ఇది చాలా పెద్ద గుడ్‌న్యూస్
టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్, వాక్యూమ్ క్లీనర్ వంటి వాటిని వైట్ గూడ్స్(White Goods)గా పిలుస్తారు. దేశంలో మెజారిటీ జనాభా ఇళ్లలో వీటిలో ఏదోక వస్తువు ఉంటుంది. కొంతకాలం వాడిన తర్వాత ఈ వస్తువులు పాడైపోతుంటాయి. వాటిని రిపేర్ చేయించడమో, కొత్త వాటిని కొనడమో చేస్తుంటారు. కొత్త వస్తువు కొంటే, కొంత కాలం వరకు ఆ వస్తువుకు వారెంటీ లేదా గ్యారెంటీ లభిస్తుంది. రిటైలర్, వారెంటీ లేదా గ్యారెంటీ కార్డ్ మీద కొన్న తేదీని రాసి, స్టాంప్ వేసి ఇస్తాడు. ఆ రోజు నుంచి ఆ కన్జ్యూమర్ గూడ్‌కు వారెంటీ లేదా గ్యారెంటీ పిరియడ్ ప్రారంభమవుతుంది. ఇంకా చదవండి
ఇంటి ముఖం పట్టిన పాకిస్తాన్ - 93 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం!
2023 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్ పరాజయంతో ముగించింది. సెమీస్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 93 పరుగులతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్... 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి దాదాపు ఎంపిక అయినట్లే. ఇంకా చదవండి