Roja Helps to Student: నీట్ ర్యాంకర్ కష్టం చూసి చలించిపోయిన ఏపీ మంత్రి రోజా
AP Minister Roja: తన దృష్టికి వచ్చిన వారిని ఆదుకొని చదివిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు ఏపీ మంత్రి రోజా. తాజాగా మరో విద్యార్థికి ఆమె సాయం చేశారు.
RK Roja News In Telugu: నీ లక్ష్యం, నీ సంకల్పం కూడా గొప్పది, నువ్వు కచ్చితంగా డాక్టర్ అవుతావు: ఆర్కే రోజా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా అంటే రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఆమె ఎప్పుడూ రాజకీయాల్లో ఎలాగైతే తనదైన శైలిలో వార్తల్లో ఉంటారో అలాగే ఆమె వ్యక్తిగతంగా సేవా గుణంలో ఓ ప్రత్యేకత ఉంది. గతంలో తన నియోజకవర్గంలో చంద్రతేజ అనే వైద్య విద్యార్థి (MBBS Student) చదువులో టాపర్ కానీ ఆర్థికంగా ఫీజ్ కట్టుకోలేనని తన చదువుకి సాయం చెయ్యాలని చంద్రతేజ రోజాను సంప్రదించాడు. వెంటనే స్పందించిన మంత్రి రోజా (AP Minister Roja) చంద్రతేజ చదువు బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం చంద్రతేజ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఓ ఆడపిల్లకి చదువును ఇవ్వాలని సంకల్పం తీసుకొని పుష్ప అనే ఓ ఆడపిల్ల చదువు బాధ్యతలు తీసుకున్నారు మంత్రి రోజా. ప్రస్తుతం పుష్ప తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇలా తన దృష్టికి వచ్చిన వారిని ఆదుకొని చదివిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు రోజా. ఇటీవల నీట్ లో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఖమ్మంకి చెందిన తాహేర్ షరీఫ్ అనే విద్యార్థి ఫీజ్ చెల్లించలేని స్థితిలో ఉన్నాడని సకాలంలో ఫీజ్ కట్టక పోతే సీటు పోగొట్టుకుంటాడని మీడియా వార్తను ప్రచురించింది. ఆ వార్త పై స్పందించిన రోజా తాహేర్ షరీఫ్ వివరాలు తీసుకున్నారు. ఆ విద్యార్థి ఫీజు వెంటనే చెల్లించారు మంత్రి ఆర్కే రోజా.
శనివారం రోజు ఏపీ మంత్రి రోజాను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపా షరీఫ్. పరీక్షల్లో ఎంతో కష్టపడి చదివిన తాను నీట్ లో ర్యాంక్ సాధించినా ఎక్కడ సీట్ కోల్పోతానో అని కంగారు పడ్డాను కానీ తన పరిస్థితి తెలుసుకొని తన చదువుకి అండగా నిలిచిన మంత్రి రోజాకి ధన్యవాదాలు అంటూ షరీఫ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. షరీఫ్ కథనం తనను ఎంతగానో కదిలించిందని ఆ విద్యార్థి యొక్క వార్తను వెలుగులోకి తెచ్చిన మీడియా ప్రతినిధుల కృషి అభినందనీయమని ఆమె అభినందించారు.