Warranty Period: టీవీ, ఏసీ, ఫ్రిజ్ కొనాలనే ఆలోచన ఉన్న వారికి ఇది చాలా పెద్ద గుడ్‌న్యూస్
Telugu Business News: గ్యారెంటీ లేదా వారెంటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త సూచనలు జారీ చేసింది.
![Warranty Period: టీవీ, ఏసీ, ఫ్రిజ్ కొనాలనే ఆలోచన ఉన్న వారికి ఇది చాలా పెద్ద గుడ్‌న్యూస్ big good news White goods warranty or guarantee period from installation date not from purchased date telugu latest business updates Warranty Period: టీవీ, ఏసీ, ఫ్రిజ్ కొనాలనే ఆలోచన ఉన్న వారికి ఇది చాలా పెద్ద గుడ్‌న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/36b10d79f922beed8ee19d069aa9c7161699590084827545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
White Goods Warranty or Guarantee Period: టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్, వాక్యూమ్ క్లీనర్ వంటి వాటిని వైట్ గూడ్స్(White Goods)గా పిలుస్తారు. దేశంలో మెజారిటీ జనాభా ఇళ్లలో వీటిలో ఏదోక వస్తువు ఉంటుంది. కొంతకాలం వాడిన తర్వాత ఈ వస్తువులు పాడైపోతుంటాయి. వాటిని రిపేర్ చేయించడమో, కొత్త వాటిని కొనడమో చేస్తుంటారు. కొత్త వస్తువు కొంటే, కొంత కాలం వరకు ఆ వస్తువుకు వారెంటీ లేదా గ్యారెంటీ లభిస్తుంది. రిటైలర్, వారెంటీ లేదా గ్యారెంటీ కార్డ్ మీద కొన్న తేదీని రాసి, స్టాంప్ వేసి ఇస్తాడు. ఆ రోజు నుంచి ఆ కన్జ్యూమర్ గూడ్‌కు వారెంటీ లేదా గ్యారెంటీ పిరియడ్ ప్రారంభమవుతుంది.
ఒకవేళ బాగు చేయించాల్సి వస్తే.. మైనర్ రిపేర్‌కు చిన్నపాటి ఖర్చు సరిపోయినా, మేజర్ రిపేర్ అయితే మాత్రం తడిచి మోపెడవుతుంది. ఒక్కోసారి, దాదాపు కొత్త వస్తువు కొన్నంత మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ వస్తువు వారెంటీ లేదా గ్యారెంటీ టైమ్ పిరియడ్‌లో (white goods warranty or guarantee period) ఉంటే మనం సేఫ్ సైడ్‌లో ఉన్నట్లే. రూపాయి ఖర్చు లేకుండా లేదా నామమాత్రపు వ్యయంతో రిపేర్ పూర్తవుతుంది. కొన్నిసార్లు, కేవలం ఒక్క రోజు తేడాతో ఆ వస్తువు మీద వారెంటీ లేదా గ్యారెంటీ ప్రయోజనాన్ని కన్జ్యూమర్లు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో... టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి వస్తువులకు గ్యారెంటీ లేదా వారెంటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త సూచనలు జారీ చేసింది.
ఇన్‌స్టలేషన్ తేదీ నుంచి వారెంటీ
కొత్తగా కొన్న వైడ్ గూడ్ వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని కొనుగోలు తేదీ నుంచి కాకుండా ఇన్‌స్టలేషన్ తేదీ నుంచి ప్రారంభించాలని... వైట్ గూడ్స్ తయారీ సంస్థలు, సెల్లర్లకు కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది. ఈ రూల్‌ను చేర్చడానికి, ఆయా కంపెనీల వారంటీ లేదా గ్యారెంటీ విధానాలను సవరించాలని సూచించింది. ఈ సవరణపై, మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్, ఇండస్ట్రీ ప్రతినిధులైన అసోచామ్, ఫిక్కీ, CIIకి లేఖలు పంపారు. వాటితో పాటు... వైట్ గూడ్స్ తయారీ సంస్థలైన శాంసంగ్, LG, పానాసోనిక్, బ్లూస్టార్, కెంట్, వాల్‌పూల్, ఓల్టాస్, బాష్, హెవెల్స్, టోషిబా, డైకిన్, సోనీ, హిటాచీ, IFB, గోద్రెజ్, యురేకా ఫోర్బ్స్, లాయిడ్ వంటి కంపెనీలకు కూడా సూచనలు పంపారు. వస్తువు ఇన్‌స్టలేషన్ జరగనప్పుడు కూడా ఆ వస్తువుకు వారెంటీ లేదా గ్యారెంటీ ప్రారంభం కావడం సరైన వ్యాపార పద్ధతి కాదని లేఖలో రోహిత్ కుమార్ పేర్కొన్నారు.
చాలా సందర్భాల్లో, వైట్ గూడ్స్ కొన్న రోజునే వాటి ఇన్‌స్టలేషన్ జరగడం లేదు. లోకల్‌గా కొంటే, పరిస్థితులను బట్టి, ఇన్‌స్టలేషన్‌కు 1-2 రోజులు, ఆన్‌లైన్‌లో కొంటే 1-3 రోజుల వరకు సమయం పడుతోంది. ఈ ఆలస్యం వల్ల, ఆ మేరకు వారెంటీ లేదా గ్యారెంటీ రోజులను వినియోగదార్లు నష్టపోతున్నారు. దీనిని నివారించి, వినియోగదార్ల ప్రయోజనాలను కాపాడడానికి కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇ-కామర్స్ ఛానెల్స్ ద్వారా కొన్న ఉత్పత్తుల డెలివరీ, ఇన్‌స్టాలేషన్‌లో ఆలస్యం కారణంగా ఈ అడ్వైజరీని జారీ చేసింది. ఇన్‌స్టలేషన్ తర్వాతి నుంచి ఉత్పత్తి వినియోగం ప్రారంభం అవుతుంది కాబట్టి, కన్జ్యూమర్లకు పూర్తి వారంటీ వ్యవధి అందుబాటులోకి వస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: 24k, 22k వద్దట - 18 క్యారెట్ల నగలే ముద్దట!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)