అన్వేషించండి

Cheddi Gang Video: తిరుపతిలో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కలకలం! డోర్ తెరిచారో ఇక అంతే - పోలీసుల హెచ్చరిక

Cheddi Gang In Tirupati: ఏపీలో కొన్ని జిల్లాల్లో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోసారి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Cheddi Gang In AP: తిరుపతి: గతంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోసారి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తిరుపతి (Tirupati) జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang) సంచారంపై నిర్దారణకు వచ్చారు. తిరుపతి నగర, శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచరిస్తున్నట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఇంటి కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు కొట్టినా తెరవకూడదని అది చాలా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.

తిరుపతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో మీ ఇంటి తలుపులు తట్టడం కాలింగ్ బెల్ కొట్టినా, వేరే రకమైన శబ్దాలు చేస్తే ప్రమాదం ఉందని.. ఎవరనేది నిర్ధారించుకోకుండా తలుపులు తీయవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా, మీకు అనుమానం కలిగే విధంగా ప్రవర్తించిన వెంటనే డయల్ 100 కి కాల్ చేయాలని లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని సూచించారు. చెడ్డీ గ్యాంగ్ సంచారం వార్తలపై జిల్లా పోలీసులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు దొంగలను పట్టుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారని తెలిపారు.

Cheddi Gang Video: తిరుపతిలో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కలకలం! డోర్ తెరిచారో ఇక అంతే - పోలీసుల హెచ్చరిక

తిరుపతి నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యంత క్రూరమైన చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచరిస్తున్నట్లు కొన్ని ఆనవాళ్లతో పాటు సమాచారం అందింది. దయచేసి నగరంలో పాటు నగర శివారులో నివాసం ఉంటున్న ప్రజలు రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు. అలాగే రాత్రి  వేళల్లో మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ ఇంటి వద్దకు వచ్చి పలకరించినా లేదా తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ కొట్టడం, ఇతరాత్రా శబ్దాలు చేసినా ప్రమాదం ఉందని కేకలు వేయాలని ప్రజలకు సూచించారు. కొందరు దుండగులు ఇలాంటి ఘటనలతో అమాయకులను తప్పుదోవ పట్టించి దొంగతనం చేస్తుంటారని, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు.

గత మూడేళ్లుగా ఇక్కడ చెడ్డీ గ్యాంగ్ కలకలం! 
2021, 2022లోనూ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఏపీలో పలు జిల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. 2021లో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. స్థానిక విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేశారు. ముందు విద్యుత్ నిలిపివేసి అనంతరం ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల్లో ఈ తతంగం ఇది రికార్డైంది. తాళాలు వేసిన ఇళ్లలను లక్ష్యంగా చేసుకుని చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అలర్ట్ చేశారు. 2022లో తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ సంచరించింది. బృందావన కాలనీలో గోడ దూకి ఓ ఇంటిలోకి ప్రవేశించి చోరీ చేశారు. చేతిలో ఇనుప రాడ్డు పట్టుకుని తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీ విడుదల చేసి ప్రజల్ని అప్రమత్తం చేయడం తెలిసిందే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget