(Source: ECI/ABP News/ABP Majha)
Chandra Mohan Death: మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?
Chandra Mohan Death News Final Rituals : చంద్రమోహన్ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నివహించనున్నారు. రెండు రోజులు ఆలస్యం ఎందుకు?
Chandra Mohan Death Final Rituals Timing : సీనియర్ కథానాయకుడు, నటుడు చంద్ర మోహన్ ఈ రోజు (నవంబర్ 11, శనివారం) ఉదయం 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయన కన్ను మూశారు. చంద్ర మోహన్ మరణంతో చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనను కడసారి చూసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు వెళుతున్నారు.
Chandra Mohan Family Details: చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఆమె రచయిత్రి కూడా! డాక్టర్ గాలి బాల సుందర రావు ఏకైక కుమార్తె. ఇక, చంద్ర మోహన్ తల్లిదండ్రుల విషయానికి వస్తే... శాంభవి, మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి. వాళ్ళది కృష్ణా జిల్లాలోని పమిడి ముక్కల గ్రామం. మే 23, 1942లో ఆ దంపతులకు మల్లంపల్లి చంద్ర శేఖర రావు జన్మించారు. ప్రేక్షకుల ముందుకు చంద్ర మోహన్ పేరుతో వచ్చింది ఆయనే.
Who is Chandra Mohan wife : చంద్ర మోహన్, జలంధర దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి. ఆవిడ సైకాలజిస్ట్. రెండో అమ్మాయి పేరు మాధవి. ఆవిడ చెన్నైలో సెటిల్ అయ్యారు. మధుర మీనాక్షి అమెరికాలో ఉంటున్నారు. ఆవిడ రావడం కోసం సమయం పడుతుంది. అందుకని, రెండు రోజులు ఆలస్యంగా అంత్య క్రియలు నిర్వహించాలని చంద్ర మోహన్ కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
హైదరాబాద్ సిటీలో చంద్ర మోహన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో ఆయనకు కడసారి వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం వేళల్లో ఆయన దహన సంస్కారాలు నిర్వహిస్తారని సమాచారం. చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకుల సందర్శనార్థం పార్థీవ దేహాన్ని ఆదివారం లేదా సోమవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకు రావచ్చు.
How old is Chandramohan : చంద్ర మోహన్ వయసు 82 ఏళ్ళు. అందులో 55 ఏళ్ళకు పైగా ఆయన సినిమాలు చేశారు. హీరోగా, నటుడిగా, క్యారెక్టర్ ఆరిస్టుగా సుమారు 950 సినిమాల్లో చంద్ర మోహన్ కనిపించారు. హీరోగా మొదటి సినిమా 'రంగుల రాట్నం'తో ఆయనకు పేరు వచ్చింది కానీ బ్రేక్ రాలేదు. అందుకని, ఆయన క్యారెక్టర్ వేషాల వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత 'సిరిసిరి మువ్వ' సినిమాతో హీరోగా ఆయనకు కె. విశ్వనాథ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత 'పదహారేళ్ళ వయసు' సినిమాతో చంద్ర మోహన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Also Read : పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య హాజరైన ఫస్ట్ ఫంక్షన్ ఇదే - ఎందుకో తెలుసా?
చంద్ర మోహన్ సుమారు 175 సినిమాల్లో హీరోగా నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలకు వస్తే లెక్క లేదు. నటుడిగా ఆయన ప్రతిభ చూపిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' ఆయన నటించిన చివరి పెద్ద సినిమా. నటించిన చివరి సినిమా కూడా ఇదే. ఆ తర్వాత శ్రీకాంత్ 'కోతల రాయుడు', గోపీచంద్ 'ఆక్సిజెన్' సినిమాల్లో కూడా చంద్ర మోహన్ కనిపించారు. అయితే... ఆ సినిమాల షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యాయి. కాకపోతే ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.