అన్వేషించండి

Chandra Mohan Death: శ్రీదేవి టు జయసుధ - స్టార్ హీరోయిన్లకు ఫస్ట్ హీరో చంద్ర మోహనే  

Senior Telugu Actor Chandra Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చంద్ర మోహన్ పక్కన మొదటి సినిమా చేస్తే స్టార్ హీరోయిన్ అవుతారనే సెంటిమెంట్ ఉంది. ఆయనతో సుమారు 60 మంది హీరోయిన్లు చేశారు. 

Chandra Mohan is the first hero for Sridevi Jayaprada Jayasudha in movies: చంద్ర మోహన్... ఈ తరం ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు. కానీ, ఆయన కెరీర్ హీరోగా మొదలైంది. అయితే... ఆ తర్వాత సరైన, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో డబ్బు కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేక... క్యారెక్టర్ ఆరిస్టుగా మారి వరుస సినిమాలు చేశారు. 'సిరిసిరి మువ్వ' సినిమాతో మళ్ళీ హీరోగా బ్రేక్ వచ్చింది. 'పదహారేళ్ళ వయసు' సినిమాతో హీరోగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

చంద్రమోహన్ సరసన సుమారు 60 మంది హీరోయిన్లు నటించారు. అందులో చాలా మంది స్టార్ హీరోయిన్లు అయ్యారు. అప్పట్లో 'చంద్ర మోహన్ పక్కన ఫస్ట్ సినిమా చేస్తే స్టార్ హీరోయిన్ కావడం గ్యారెంటీ' అని పేరు వచ్చింది. ఒకటి రెండు సినిమాలు చేసి సక్సెస్ కాని హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో బిజీ కావడానికి చంద్ర మోహన్ సరసన యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు.   

Also Read : చంద్రమోహన్‌ అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడ జరుగుతాయి?

బాలనటిగా పలు సినిమాలు చేసిన శ్రీదేవి... 'పదహారేళ్ళ వయసు'తో కథానాయికగా మారారు. అందులో చంద్ర మోహన్ హీరో. ఆ తర్వాత శ్రీదేవి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కథానాయికగా జయప్రద తొలి సినిమా 'సిరిసిరి మువ్వ'లో కూడా ఆయనే హీరో. జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ... ఇలా ఎంత మందికో తొలి హీరో చంద్ర మోహన్. వాళ్ళ ప్రతిభ వల్ల ఆయా హీరోయిన్లు ఉన్నత స్థానానికి చేరుకున్నారు తప్ప... అందులో తన ప్రమేయం ఏమీ లేదని రెండు మూడు సందర్భాల్లో చంద్ర మోహన్ చెప్పారు. అయితే... ఆయన పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ అనే సెంటిమెంట్‌ మాత్రం అప్పట్లో బలంగా ఉండేది. 

జయసుధతో 34 సినిమాలు...
చంద్ర మోహన్ సరసన ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరంటే? సహజ నటి జయసుధ పేరు చెప్పాలి. వాళ్లిద్దరూ 34 చిత్రాల్లో జంటగా నటించారు. లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయ శాంతి... ఈ హీరోయిన్లతో కూడా ఆయన పది, పదిహేను సినిమాలు చేశారు. 

శ్రీదేవితో మళ్ళీ చేయడం కుదరలేదు!
చంద్ర మోహన్ సరసన 'పదహారేళ్ళ వయసు' సినిమాతో శ్రీదేవి కథానాయికగా పరిచయం అయినప్పటికీ... అంతకు ముందు బాలనటిగా ఆయనతో సినిమాలు చేశారు. 'యశోదా కృష్ణ' సినిమా చేసేటప్పుడు... చిత్రీకరణ పూర్తి చేసుకుని చెన్నై వెళ్ళేటప్పుడు శ్రీదేవి తన ఒడిలో నిద్రపోయేదని చంద్ర మోహన్ ఒకానొక సమయంలో గుర్తు చేసుకున్నారు. తన సరసన కథానాయికగా చేసినా... ఆ తర్వాత హైట్ పెరగడంతో తనతో మళ్ళీ హీరోగా సినిమా చేయడం కుదరలేదని ఆయన పేర్కొన్నారు. 'మీ పక్కన  మళ్లీ ఎప్పుడు కథానాయికగా చేస్తాను?' అని చంద్ర మోహన్ (Chandra Mohan Sridevi Movies)ని శ్రీదేవి అడిగేవారట (Chandra Mohan Heroines Sentiment). 

Also Read పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య హాజరైన ఫస్ట్ ఫంక్షన్ ఇదే - ఎందుకో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Viral Video : కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
Mahindra Thar: థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
Samantha: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
Embed widget