Telangana Elections 2023: తెలంగాణలో పార్టీలకు ఈసీ షాక్, ఆ యాడ్స్ నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు!
EC Bans Political ads: తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలో ఎలక్షన్ షాకిచ్చింది. రాష్ట్రంలో అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు జారీ చేసింది.
EC cancels approval for all political ads: హైదరాబాద్: తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలో ఎలక్షన్ షాకిచ్చింది. రాష్ట్రంలో అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు జారీ చేసింది. ఇకనుంచి పొలిటికల్ యాడ్స్ నిలిపివేయాలని మీడియాను ఈసీ ఆదేశించింది. అన్ని చానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ లేఖలు రాశారు. లీడర్లు ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తూ తమకు కావాల్సినట్లు ప్రకటనలు తయారుచేసి ప్రచారం చేసుకుంటున్నారని ఈసీ అధికారులు గుర్తించారు.
అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈఓ అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు తమ ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తున్న కారణంగా పొలిటికల్ యాడ్స్ ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఓ లేఖలో పేర్కొంది. ఆ మేరకు మీడియా సంస్థలకు ఎన్నికల ప్రధానాధికారి లేఖ రాశారు. తక్షణమే పొలిటికల్ ప్రకటనల ప్రసారాలను నిలిపివేయాలని ఛానళ్లకు సూచించారు. ఆ ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు, క్లిప్ లను కూడా సీఈఓ కార్యాలయం జతపరచింది.