అన్వేషించండి

Tiger 3 Jr NTR : ఎన్టీఆర్ అభిమానులకు సారీ - హృతిక్ రోషన్ ఉన్నాడు కానీ?

Tiger 3 Release Live Updates : బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమా 'టైగర్ 3'. ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అయితే... ఈ సినిమా కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదు.

Jr NTR Cameo in Tiger 3 : బాలీవుడ్ సినిమా 'టైగర్ 3' కోసం టాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూడడానికి ఓ కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. సల్మాన్ ఖాన్ సినిమా అయినప్పటికీ... తెలుగులో మాస్ ప్రేక్షకుల వరకు 'టైగర్ 3' చేరింది. ఎందుకంటే... మన ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనువిందు చేస్తారని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరగడం! దానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.

సారీ... 'టైగర్ 3'లో ఎన్టీఆర్ లేరు!
భారతీయ గూఢచారిగా సల్మాన్ ఖాన్ (Salman Khan) మరోసారి సందడి చేసిన సినిమా 'టైగర్ 3'. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు 'టైగర్ 3'లో ఎన్టీఆర్ లేరని కన్ఫర్మ్ చేశారు. సో... ఇది యంగ్ టైగర్ అభిమానులకు డిజప్పాయింట్ న్యూస్ అన్నమాట! ఎన్టీఆర్ (Jr NTR in Tiger 3)తో పాటు బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సైతం 'టైగర్ 3'లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఆయన అయితే ఉన్నారు కానీ... ఎండ్ క్రెడిట్ టైటిల్స్ అప్పుడు మాత్రమే ఉన్నారట. అదీ సంగతి!

'టైగర్ 3'లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఎదురు చూడడానికి కారణం 'వార్ 2' (War 2). యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో తాజా సినిమా 'టైగర్ 3'. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' తర్వాత ఆ ఫ్రాంచైజీలో తెరకెక్కిన తాజా చిత్రమిది. 

Also Read : 'టైగర్ 3'కి యాంటీ ఫ్యాన్స్ షాక్ - ఇండియాలో నెగిటివ్ రివ్యూలు, బ్లాక్‌బస్టర్ టాక్‌తో మొదలైన ఓవర్సీస్ షోలు

'పఠాన్'లో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రకు మంచి స్పందన లభించింది. దాంతో 'టైగర్ 3'లో షారుఖ్ ఖాన్ చేత అతిథి పాత్ర చేయించారు. అంతే కాదు... 'వార్ 2' కంటే ముందు 'టైగర్ 3'లో ఎన్టీఆర్ కనిపిస్తారని, ఆయన పాత్రను సల్మాన్ ఖాన్ పరిచయం చేస్తారని ప్రచారం జరిగింది. అటువంటి ఏమీ లేదని ఈ రోజు క్లారిటీ వచ్చింది.
  
'వార్ 2'తోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆయన బాలీవుడ్ ఎంట్రీ కోసం 'వార్ 2' వరకు వెయిట్ చేయాలి. దాని కంటే ముందు 'దేవర' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆయన పలకరించనున్నారు. నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం, ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో హిందీ ప్రేక్షకులలో సైతం 'దేవర' మీద మంచి అంచనాలు ఉన్నాయి. 'దేవర', 'వార్ 2' సినిమాలతో పాటు 'కెజియఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 
  
Also Read మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Hero Nikhil private videos: హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Arasavalli Sun Temple Ratha Saptami | అసరవిల్లి సూర్యదేవాలయం ఎందుకు ప్రత్యేకమంటే | ABP DesamAyodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Hero Nikhil private videos: హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Kalvakuntla Kavitha: సమగ్ర సర్వే సరిగ్గా జరగలేదు, అన్నీ కాకి లెక్కలే - తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
సమగ్ర సర్వే సరిగ్గా జరగలేదు, అన్నీ కాకి లెక్కలే - తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
masturbation ban: హస్తప్రయోగాన్ని నిషేధించాలట-పార్లమెంట్‌లో బిల్లు కూడా పెట్టేశాడు- ఈ ఎంపీ మరీ అతిగాడిలా ఉన్నాడే !
హస్తప్రయోగాన్ని నిషేధించాలట-పార్లమెంట్‌లో బిల్లు కూడా పెట్టేశాడు- ఈ ఎంపీ మరీ అతిగాడిలా ఉన్నాడే !
TG EAPCET: టీజీ ఎప్‌సెట్, పీజీ ఈసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
టీజీ ఎప్‌సెట్, పీజీ ఈసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Chandrababu: బడ్జెట్ లో ఏపీ ప్రస్తావన రాలేదన్న విమర్శలపై ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు క్లారిటీ
బడ్జెట్ లో ఏపీ ప్రస్తావన రాలేదన్న విమర్శలపై ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు క్లారిటీ
Embed widget