Top 5 Headlines Today: జగన్ హెచ్చరించిన మంత్రులెవరు?; డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభించిన కేసీఆర్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
జగన్ వార్నింగ్‌తో అమాంతం పెరిగిన ఎమ్మెల్యేల పనితీరు
అధికార పార్టీలో శాసన సభ్యుల పని తీరు తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. గడప గడపకు కార్యక్రమం ద్వారా శాసన సభ్యుల పని తీరును ముఖ్యమంత్రి బేరీజు వేస్తుండటంతో వెనుకబడిన వారు కాస్త మెరుగు పడినట్టు కనిపిస్తోంది. కానీ ఇంకా కొందరు పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 36, 34, 18... అధికార పార్టీలో శాసన సభ్యుల పని తీరు మెరుగు పడుతుందనేందుకు ముఖ్యమంత్రి ప్రకటించిన నెంబర్స్ ఇవి. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా తీసుకుంది. శాసన సభ్యులను ప్రతి గడపకు పంపి, ప్రజలతో మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ ఇది. ఇంకా చదవండి
తెలంగాణ బీజేపీలో సైలెంట్ మోడ్‌లో సీనియర్లు - వారంతా డౌటేనా ?
తెలంగాణ బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. అగ్రనేతల పర్యటనలు వాయిదా పడటం.. పార్టీల్లో చేరికలు లేకపోవడం.. కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ప్రచారంతో ఎక్కువ మంది సీనియర్లు సైలెంట్ అవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. బీజేపీ 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికీ బీజేపీ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు బీజేపీ నేతలు. తెలంగాణలో గురువారం ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలన కలవాలనుకున్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలస్తున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఇంకా చదవండి
కొల్లూరులో ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ టౌన్‌షిప్ ప్రారంభించిన కేసీఆర్
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల టౌన్‌షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 145 ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రభుత్వం 15,660 ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చింది. ఇది ఆసియాలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద టౌన్‌షిప్‌గా తెలంగాణ సర్కారు చెబుతోంది. దీనికి కేసీఆర్ నగర్ టీబీకే డిగ్నిటీ హౌసింగ్ కాలనీగా నామకరణం చేశారు. ప్రత్యేక వాహనంలో ఆ టౌన్‌షిప్‌లో ఇళ్లను సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇంకా చదవండి
జోగి రమేష్ , వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఫ్లెక్సీల చిచ్చు ! రంగంలోకి సజ్జల
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మద్య విభేదాలు సర్దిచెప్పే కొద్దీ పెరుగుతున్నాయి. మైలవరం నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతల మద్య విభేదాలు బహిర్గతం కావటంతో, అనుచరులు సైతం బాహా బాహీకి దిగుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల మధ్య వివాదం పై క్యాడర్ లో సైతం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్ , మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వివాదం బహిరంగంగా తెర మీదకు వచ్చింది. తాజాగా ఇద్దరు నేతలకు చెందిన వారు రెండు వర్గాలు విడిపోయి, నియోజకవర్గంలో గొడవలకు దిగుతున్నారు. వసంత వర్సెస్ జోగి గా మారి రాజకీయం పై పార్టీలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంకా చదవండి
జగన్ హెచ్చరించిన ఆ 18 మందిలో మంత్రులు కూడా ఉన్నారా ?
వైఎస్ఆర్‌సీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది గడప గడపకూ వెళ్లడం లేదని.. వారికి చివరి చాన్స్ ఇస్తున్నానని.. వారిని పిలిచి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని సీఎం జగన్ సమీక్షలో హెచ్చరించారు. అయితే ఆ పద్దెనిమిది ఎవరు అన్నది బయట పెట్టలేదు. ఈ హెచ్చరికల తర్వాత వైసీపీలో ఆ 18మంది ఎవరు అని ఏ ఇద్దరు నేతలు కలిసినా మాట్లాడుకుంటున్నారు. ఇంకా చదవండి