అన్వేషించండి

Telangana BJP : తెలంగాణ బీజేపీలో సైలెంట్ మోడ్‌లో సీనియర్లు - వారంతా డౌటేనా ?

తెలంగాణలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో చాలా మంది సీనియర్లు పాల్గొనలేదు. వారి గైర్హాజరీ కారణాలపై బీజేపీ హైకమాండ్ ఆరా తీస్తోంది.

 

Telangana BJP :  తెలంగాణ బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. అగ్రనేతల పర్యటనలు వాయిదా పడటం.. పార్టీల్లో చేరికలు లేకపోవడం.. కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ప్రచారంతో ఎక్కువ మంది సీనియర్లు సైలెంట్ అవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు.  బీజేపీ 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా   ఇంటింటికీ బీజేపీ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు  బీజేపీ నేతలు.  తెలంగాణలో గురువారం ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలన కలవాలనుకున్నారు.  పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలస్తున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. 

బీజేపీ కార్యక్రమాల్లో కనిపించని ఈటల. రాజగోపాల్ రెడ్డి                           

ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టలేదు. అలాగే మరికొంత మంది కీలక నేతలు కూడా అంతే అసంతృప్తితో ఉన్నారు. యెన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి వారు కూడా దూరంగా ఉన్నారు. వీరు ఇన్ యాక్టివ్ కావడంతో  బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ పాలనా విజయాలపై చేపట్టిన కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొంటారని అనుకున్నారు. కానీ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న వారే పాల్గొనకపోవడంతో తెలంగాణ బీజేపీ గురించి ఢిల్లీ అగ్రనేతలు ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. 

జగన్ వార్నింగ్‌తో అమాంతం పెరిగిన ఎమ్మెల్యేల పనితీరు- ఆ నెంబర్‌ సగానికి ఎలా పడింది!

పార్టీ మారే నేతలే పెద్దగా  పట్టించుకోవడం లేదా ?

ఈటల రాజేందర్  కొంత కాలగా బీజేపీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. కానీ హైకమాండ్ బండి సంజయ్ నే కొనసాగించాలని నిర్ణయించుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ ను ఓడించే పార్టీ బీజేపీనేనని నమ్మి పార్టీలో చేరారు.కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్న భావనలో ఉన్నారు. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో నే ఉండనున్నారు. రాజగోపాల్ రెడ్డి మళ్లీ పార్టీ మారకపోతే ఆయన సోదరుడిపై కాంగ్రెస్ లో అనుమాన మేఘాలుంటాయి. అందుకే ఆయన కూడా పార్టీ మారాలనుకుంటున్నారని అంటన్నారు. వీరిద్దరూ తరూూ సమవేశం అవుతున్నారని ఇంకా చాలా మంది పార్టీ మారే  వారి జాబితాలో ఉన్నారంటున్నారు. 

జగన్ హెచ్చరించిన ఆ 18 మందిలో మంత్రులు కూడా ఉన్నారా ?

తెలంగాణ బీజేపీ పై దృష్టి సారించలేకపోతున్న హైకమాండ్ 
 
తెలంగాణ బీజేపీపై హైకమాండ్ దృష్టి సారించలేకపోతోంది. అగ్రనేతల పర్యటనలు రద్దు అవుతున్నాయి.  అమిత్ షా ఖమ్మం పర్యటన సందర్భంగా బలప్రదర్శనకు ఏర్పాట్లు చేసినప్పటికీ .. గుజరాత్ తో తుపాన్ కారణంగా రద్దు కావడంతో పార్టీ నేతల్లో నిరాశ ఏర్పడింది. అదే సమయంలో పార్టీ నేతల్లో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget