అన్వేషించండి

జగన్ వార్నింగ్‌తో అమాంతం పెరిగిన ఎమ్మెల్యేల పనితీరు- ఆ నెంబర్‌ సగానికి ఎలా పడింది!

గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో రెండు నెలల క్రితం వరకు 36 మంది శాసన సభ్యులు వెనుకబడి ఉన్నారని ప్రచారం జరిగింది.ఇప్పుడు ఆగ్రాఫ్‌ అమాంతం తగ్గిపోయింది.

అధికార పార్టీలో శాసన సభ్యుల పని తీరు తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. గడప గడపకు కార్యక్రమం ద్వారా శాసన సభ్యుల పని తీరును ముఖ్యమంత్రి బేరీజు వేస్తుండటంతో వెనుకబడిన వారు కాస్త మెరుగు పడినట్టు కనిపిస్తోంది. కానీ ఇంకా కొందరు పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

36, 34, 18... అధికార పార్టీలో శాసన సభ్యుల పని తీరు మెరుగు పడుతుందనేందుకు ముఖ్యమంత్రి ప్రకటించిన నెంబర్స్ ఇవి. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా తీసుకుంది. శాసన సభ్యులను ప్రతి గడపకు పంపి, ప్రజలతో మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ ఇది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన మెదట్లో చాలా మంది శాసన సభ్యులు వెనుకబడ్డారు. ఆ తరువాత ముఖ్యమంత్రి గడప గడప కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. శాసన సభ్యుల పని తీరు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తెలియడంతో అంతా అలర్ట్ అయ్యారు. 

గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో సీరియస్‌గా పాల్గొన్నారు. గత రెండు నెలల క్రితం వరకు 36 మంది శాసన సభ్యులు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వెనుకబడి ఉన్నారని ప్రచారం జరిగింది. అలాంటి వారిని తప్పించేందుకు సైతం పార్టీ అధినేత జగన్ రెడీగా ఉన్నారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పరిస్థితుల్లో భారీగా మార్పులు వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి..

34 నుంచి 18కి తగ్గిన సంఖ్య...
పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యూహత్మంగా గడప గడపకు మన ప్రభుత్వాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ కార్యక్రమం భారీగా సక్సెస్ అయ్యింది కూడా. దీంతో జగన్ ఈ కార్యక్రమాన్ని మరింత జోరుగా పెంచేందుకు శ్రద్ద చూపించటంతో శాసన సభ్యులు, ఇంచార్జ్ కదలాల్సి వచ్చింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తప్పని పరిస్థితుల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనక తప్పలేదు. 

మొదట్లో చాలా మంది శాసన సభ్యులు లైట్ తీసుకున్నప్పటికి ఆ తరువాత పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా జగన్ చూపించిన శ్రద్ధ కారణంగా అందరూ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనక తప్పలేదు. దీంతో ఇప్పటి వరకు వెనుకబడిన శాసన సభ్యులు సైతం గడప గడపకు కార్యక్రమంలో ముందుకు వెళుతున్నారు. దీంతో 34 మందిపై అసంతృప్తి అంటూ మెదటి నుంచి జరుగుతున్న ప్రచారం కాస్త ఇప్పుడు 18మందికి తగ్గిపోయింది.

అంతా ఐ ప్యాక్ మహిమ...
గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వెనుక బడిన శాసన సభ్యుల సంఖ్య ఉన్నపళంగా సగానికి పడిపోవటానికి కూడా ప్రత్యేకమైన కారణాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఐ ప్యాక్ టీం నిత్యం పర్యవేక్షిస్తోంది. శాసన సభ్యలు రోజూ ఎన్ని గంటలు నడిచారు, ఎంత మంది నియోజకవర్గ ప్రజలను కలిశారు, వంటి వివరాలను పర్యవేక్షించి రిపోర్ట్‌లు సీఎంవోకు పంపించారు. గంటల వారీగా, రోజుల వారీగా ముఖ్యమంత్రి పేషికి పంపటంతో శాసన సభ్యులు అలర్ట్ అవ్వక తప్పలేదని చెబుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రతి నెలా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై సమీక్ష చేయటంతో, కార్యక్రమం సీరియస్‌నెస్ కూడా పెరిగిందని దీంతో 36, 34, మంది శాసన సభ్యులు వెనుకబడి ఉన్నారనే సంఖ్య ఇప్పుడు 18మందికి తగ్గిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget