కొల్లూరులో ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ టౌన్‌షిప్ ప్రారంభించిన కేసీఆర్
కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల టౌన్‌షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇది ఆసియాలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద టౌన్‌షిప్‌గా తెలంగాణ సర్కారు చెబుతోంది.
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల టౌన్‌షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 145 ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రభుత్వం 15,660 ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చింది.
అబ్బుర పరిచే ఆత్మగౌరవ సౌధం.. కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం
— BRS Party (@BRSparty) June 22, 2023
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద 15,660 డబుల్ బెడ్ రూమ్‌ల గృహ సముదాయాన్ని… pic.twitter.com/KLot9t677p
ఇది ఆసియాలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద టౌన్‌షిప్‌గా తెలంగాణ సర్కారు చెబుతోంది. దీనికి కేసీఆర్ నగర్ టీబీకే డిగ్నిటీ హౌసింగ్ కాలనీగా నామకరణం చేశారు. ప్రత్యేక వాహనంలో ఆ టౌన్‌షిప్‌లో ఇళ్లను సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో సకల హంగులతో, ఆధునిక సౌకర్యాలతో ఇంటి నిర్మాణాలు చేపట్టారు.
— BRS Party (@BRSparty) June 22, 2023
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ @KTRBRS, శ్రీ @BRSHarish, శ్రీమతి @SabithaindraTRS, శ్రీ @chmallareddyMLA, శ్రీ @VPR_BRS, శ్రీ @YadavTalasani తదితరులు పాల్గొన్నారు.… pic.twitter.com/fJOyqn1QP3
560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్‌లో ఇళ్లు నిర్మించారు. ఇందులో దాదాపు నలభై శాతం స్థలంలో ఇళ్లు నిర్మించారు మిగిలిన స్థలాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయనున్నారు. టౌన్‌షిప్‌ను మొత్తం 117 బ్లాక్‌లుగా విభజించారు. G+9, G+10, G+11 అంతస్తులు చొప్పున ఈ టౌన్‌షిప్ నిర్మించారు.
Live: CM Sri KCR inaugurating Medha Rail Coach Factory at Kondakal in Rangareddy district. https://t.co/K6eeYzVgqI
— BRS Party (@BRSparty) June 22, 2023