Top Headlines Today: బీఆర్ఎస్ లిస్టులో జగ్గారెడ్డి పేరుందా?; ఏపీలో పంచాయతీల ఫలితాలు ఇవే - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
బీఆర్ఎస్ తొలి జాబితాలో జగ్గారెడ్డి పేరు!
రాహుల్ గాంధీతోనే తన ప్రయాణం అని, తాను బీఆర్ఎస్ లోకి వెళ్తున్న అనే ప్రచారం అబద్ధం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బీఆర్ఎస్ ప్రకటించబోయే తొలి జాబితాలో జగ్గారెడ్డి పేరు ఉంటుందని సైతం సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ లోని ఓ వర్గం నుంచి ప్రచారం జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. మూర్ఖులు, దద్దమ్మలు ఈ ప్రచారం బంద్ చేయాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఏ సమావేశం జరిగినా నాకు ఫోన్లు వస్తాయి, సమావేశానికి రావాలని చెబుతారని, ఈరోజు పిసిసి సమావేశం.. అది డైరెక్షన్ మీటింగ్ అన్నారు. అన్ని సమావేశాలు, పార్టీ మీటింగ్ లకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇంకా చదవండి
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ కోసమే బీజేపీ వెయిటింగ్ - కేసీఆర్ తొందరపడతారా?
భారత రాష్ట్ర సమితి తొలి జాబితా విడుదలపై గత వారం, పది రోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. ఇదిగో జాబితా, అదిగో జాబితా అంటున్నారు కానీ.. అసలు జాబితా రిలీజ్ కావడం లేదు. కానీ ఇదే జాబితా అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అందులో తప్పనిసరిగా టిక్కెట్లు వారికే అనే నేతల పేర్లతో పాటు కాస్త డైలమాలో ఉన్న నేతల పేర్లు కూడా ఉన్నాయి. కానీ అసలు కేసీఆర్ మనసులో ఏముందో.. ఆయన ఫైనల్ చేసుకున్న లిస్టులో ఎవరి పేర్లున్నాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ ట్విస్టేమిటంటే బీఆర్ఎస్ తొలి జాబితా కోసం.. బీఆర్ఎస్ ఆశావహులే కాదు.. బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. ఎందుకంటే.. చేరికల కోసం...! ఇంకా చదవండి
పంచాయతీ ఉపఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మద్దతుదారుల హోరాహోరీ - ఫలితాలు ఇవే!
ఏపీలో పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వచ్చాయి. పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు పోటీ పడ్డారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తర్వాత చనిపోయిన వారి స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఏపీలో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు జరిగాయి. బాపట్ల జిల్లా పర్చూరు పావులూరు గ్రామ సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు విజయం సాధించారు. పాడేరు నియోజకవర్గం సీలేరు, హిందూపురం నియోజకవర్గం చలివెందుల గ్రామ పంచాయతీ సర్పంచ్‌లుగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఇంకా చదవండి
కుప్పం టు కృష్ణా జిల్లా - లోకేష్ తనను ప్రజల ముందు ఆవిష్కరించుకున్నారా?
జనవరి నెలాఖరులో కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరింది. 2500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. లోకేష్‌లో వచ్చిన మార్పులు.. భవిష్యత్ నాయకుడిగా ఎదిగిన వైనం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాశమవుతోంది. గతంలో లోకేష్‌కు సాఫ్ట్ ఇమేజ్ ఉండేది. నీట్ షేవ్ తో ఉండేవారు. రాజకీయాలకు అది సూట్ కాదన్న అభిప్రాయం ఉంది. ఇంకా చదవండి
చంద్రయాన్3 ల్యాండర్‌కి ఆఖరి డీబూస్టింగ్ విజయవంతం
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా రెండు రోజుల క్రితం ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్‌కు రెండోసారి ఆఖరి డీబూస్టింగ్ విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. తాజా విన్యాసాంతో ల్యాండర్ మాడ్యుల్ ను 25 కి.మీ x 135 కి.మీ. కక్ష్యకు తగ్గించారు. ఆగస్టు 19 అర్ధరాత్రి దాటాక (ఆగస్టు 20) రాత్రి 1.50 ప్రాంతంలో ఈ డీబూస్టింగ్ ప్రక్రియ చేపట్టామని ఇస్రో ప్రకటించింది. ఇంకా చదవండి
అల్పపీడనం ఎఫెక్ట్, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
నిన్నటి అల్పపీడనం ఈ రోజు ఉత్తర ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (ఆగస్టు 19) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వాలి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఇంకా చదవండి
అనుష్క సినిమా ట్రైలర్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే?
తెలుగు తెర అరుంధతి, దేవసేన అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty MR Polishetty Movie). ఇందులో ఆమెకు జోడీగా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించారు. ఇప్పటికే సినిమా విడుదల కావాలి. కానీ, కొన్ని కారణాల వల్ల విడుదల కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... త్వరలో సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఇంకా చదవండి
అనసూయ విడాకులు తీసుకుంటున్నారా? ఏందీ కొత్త గోల?
స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఫ్యామిలీ గురించి ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు వివాహమై సుమారు 13 ఏళ్ళు. తెలుగు ప్రేక్షకులకూ, బుల్లితెర వీక్షకులకూ ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ తెలుసు. భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇంకా చదవండి
వావ్ అనిపిస్తున్న కొత్త టాటా నెక్సాన్ డిజైన్ - లుక్ టీజ్ చేసిన కంపెనీ!
టాటా మోటార్స్ తన కొత్త నెక్సాన్‌ను త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడానికి అతిపెద్ద కారణం దాని డిజైన్. ఇందులో చాలా మార్పులు చేశారు. కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ సరిగ్గా కొత్త తరం లాగానే ఉంది. ఇందులో డిజైన్ పరంగా చాలా మార్పులు చేశారు. ఇంకా చదవండి
వరుణుడు ఆపిన ఆటలో విజయం మనదే - ఐర్లాండ్‌పై రెండు పరుగులతో టీమిండియా విక్టరీ!
ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. వర్షం అంతరాయం కలిగించిన మొదటి టీ20లో రెండు పరుగులతో డీఆర్ఎస్ పద్ధతిలో గెలుపు అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అనంతరం భారత్ 6.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం పడింది. తిరిగి మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడంతో డీఆర్ఎస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఇంకా చదవండి