News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chandrayaan 3 Update: చంద్రయాన్3 ల్యాండర్‌కి ఆఖరి డీబూస్టింగ్ విజయవంతం - ఇక ల్యాండింగ్‌కు అతి చేరువలోనే

ఆగస్టు 19 అర్ధరాత్రి దాటాక (ఆగస్టు 20) రాత్రి 1.50 ప్రాంతంలో ఈ డీబూస్టింగ్ ప్రక్రియ చేపట్టామని ఇస్రో ప్రకటించింది.

FOLLOW US: 
Share:

చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా రెండు రోజుల క్రితం ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్‌కు రెండోసారి ఆఖరి డీబూస్టింగ్ విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. తాజా విన్యాసాంతో ల్యాండర్ మాడ్యుల్ ను 25 కి.మీ x 135 కి.మీ. కక్ష్యకు తగ్గించారు. ఆగస్టు 19 అర్ధరాత్రి దాటాక (ఆగస్టు 20) రాత్రి 1.50 ప్రాంతంలో ఈ డీబూస్టింగ్ ప్రక్రియ చేపట్టామని ఇస్రో ప్రకటించింది. 

ఇక ల్యాండర్ మాడ్యుల్ ఇంటర్నల్‌ చెక్స్‌ని పూర్తి చేసుకుంటుందని, చంద్రుడిపై సూర్యోదయం తర్వాత నిర్దేశిత ప్రాంతంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 23న సాయంత్రం దాదాపు 17.45 గంటల ప్రాంతంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని ఇస్రో వివరించింది. 

ఆగస్టు 17న వేరుపడ్డ ల్యాండర్ మాడ్యుల్

చంద్రయాన్ 3 లోని ల్యాండర్ మాడ్యుల్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి గురువారం (ఆగస్టు 17) విజయవంతంగా విడిపోయింది. ఈ ల్యాండర్ విక్రమ్ మాడ్యూల్ ఆ రోజు నుంచి తనంతతానుగా చంద్రుని చుట్టూ తిరుగుతూ తాజాగా మరింత దిగువ కక్ష్యలోకి దిగింది. విడిపోయేటప్పుడు ‘థ్యాంక్స్ ఫర్ ద రైడ్, మేట్’ అని ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యుల్ కి చెప్పినట్లుగా ఇస్రో వెల్లడించింది. సపరేషన్ అనేది చంద్రుడి 153x163 కిలో మీటర్ల కక్ష్యలో జరిగింది. తాజాగా డీబూస్టింగ్ ప్రక్రియ ద్వారా 25 కి.మీ x 135 కి.మీ. కక్ష్యలోకి ల్యాండర్ విక్రమ్ చేరింది.

ల్యాండర్ విక్రమ్ వేగం, ఎత్తు (Alititude) ఎలా తగ్గుతుంది?

ల్యాండర్ ఎత్తును, వేగాన్ని తగ్గించడానికి దాని ఇంజన్లను మండిస్తారు. అంటే అవి వ్యతిరేక దిశలో మండడం వల్ల ల్యాండర్ నెమ్మది అవుతుంది. ల్యాండర్ నిర్దేశిత ప్రదేశానికి వచ్చిన తర్వాత, సాఫ్ట్ ల్యాండింగ్ దశ ప్రారంభం అవుతుంది. ఇదే చాలా కీలకమైన అంశం. ఇస్రోకు ఇది అత్యంత కష్టతరమైన దశ ఇది. గత చంద్రయాన్ 2 ప్రయోగంలో విఫలం జరిగింది ఇక్కడే. చంద్రుడికి 25 నుంచి 30 కి.మీ ఎత్తులో విక్రమ్ స్పీడ్ తగ్గిపోయి, ఆ తర్వాత నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై దిగాల్సి ఉంటుంది. చంద్రుడిని తాకే సమయంలో ల్యాండర్‌ విక్రమ్ వర్టికల్ వెలాసిటీ సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్‌ వెలాసిటీ సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చేయాల్సి ఉంటుంది. అయితేనే సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అవుతుంది.

రష్యా లూన్ - 25లో సాంకేతిక సమస్య

చంద్రుడిపై అన్వేషణ కోసం రష్యా పంపిన స్పేస్ క్రాఫ్ట్ లూన్ 25లో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా ఆ దేశ స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ ప్రకటించింది. శనివారం లూన్ 25ను ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తుండగా ఈ గ్లిట్చ్‌ను గుర్తించినట్లుగా రోస్‌కాస్మోస్ వెల్లడించింది. అన్ని సక్రమంగా జరిగితే సోమవారం నాడు (ఆగస్టు 21) న లూన్ 25 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ కావాల్సి ఉంది. 

Published at : 20 Aug 2023 06:59 AM (IST) Tags: Lander Vikram India Moon Mission chandrayaan 3 update de-orbiting maneuver ISRO Updates

ఇవి కూడా చూడండి

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

అంబులెన్స్ కు దారివ్వని బిహార్ సీఎం సెక్యూరిటీ, ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు

అంబులెన్స్ కు దారివ్వని బిహార్ సీఎం సెక్యూరిటీ, ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ