అన్వేషించండి

Miss Shetty MR Polishetty Trailer : అనుష్క సినిమా ట్రైలర్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే?

అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ సినిమా ట్రైలర్ రెడీ అయ్యింది. రిలీజ్ ఎప్పుడంటే?

తెలుగు తెర అరుంధతి, దేవసేన అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty MR Polishetty Movie). ఇందులో ఆమెకు జోడీగా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించారు. ఇప్పటికే సినిమా విడుదల కావాలి. కానీ, కొన్ని కారణాల వల్ల విడుదల కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... త్వరలో సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 

ఆగస్టు 21న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ట్రైలర్!
Miss Shetty MR Polishetty Trailer Release Date : సోమవారం... ఈ నెల 21న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. 

నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. సందీప్ కిషన్, జగపతి బాబు, రెజీనా, కళ్యాణి ప్రధాన తారలుగా 'రారా కృష్ణయ్య' చిత్రాన్ని తెరకెక్కించిన మహేష్ బాబు .పి (Mahesh Babu P) దర్శకత్వం వహించారు. అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశారు. 

Also Read ఝలక్ ఇచ్చిన అనసూయ - సోషల్ మీడియా నెగిటివిటీకి కాదు, ఏడ్చింది అందుకేనట!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

సెప్టెంబర్ 7న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'
Miss Shetty Mr Polishetty Release Date: తొలుత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ తేదీన సినిమా విడుదల చేయడం లేదని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా వేయక తప్పలేదని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఆగస్టు 4 నుంచి చిత్రాన్ని వాయిదా వేశామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆగస్టు 18న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదల కావచ్చని వినిపించింది. ఆ ఊహాగానాలకు తెర దించుతూ... సెప్టెంబర్ 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు.

Also Read 'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ - బాలకృష్ణ ముందున్న టార్గెట్ ఎంతంటే?

అనుష్క సినిమా థియేటర్లలో వచ్చి ఐదేళ్ళు అవుతోంది. 'భాగమతి' 2018లో వస్తే... ఆ తర్వాత ఆమె నటించిన 'నిశ్శబ్దం' ఓటీటీలో విడుదలైంది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి'లో అతిథి పాత్రలో కనిపించారంతే! సో, అనుష్క సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 'జాతి రత్నాలు' విజయం తర్వాత నవీన్ పోలిశెట్టి సినిమా కోసం కూడా కొందరు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సినిమా శాటిలైట్ & డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జీ చేతికి వెళ్లాయి. 

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ :  యువీ క్రియేష‌న్స్‌, నిర్మాత‌లు:  వంశీ - ప్ర‌మోద్‌, ర‌చ‌న‌ & ద‌ర్శ‌క‌త్వం:  మ‌హేష్ బాబు .పి, సంగీతం : రధన్, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు, ఛాయాగ్రహణం :  నిర‌వ్ షా, నృత్యాలు :  రాజు సుంద‌రం & బృందా, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : రాజీవ‌న్‌. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget