Indian Army: ఆర్మీలో ఎక్కువగా ఆ రాష్ట్రం వాళ్లే, సైన్యంలో చేరటం వారికి ఓ ఎమోషన్
విదేశాల్లోనూ అగ్నిపథ్ తరహా పథకం అమలవుతోందని అనవసరంగా ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని స్పష్టం చేస్తోంది. పైగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిలిపివేసేదే లేదని గట్టిగానే చెబుతోంది.
అగ్నిపథ్‌పై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం ఈ పథకం గురించి ప్రకటన చేసినప్పటి నుంచి యువతలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారంటూ యువకులు మండిపడుతుంటే, కేంద్రం మాత్రం అదేం లేదని చెబుతోంది. దేశ యువతకు ఇదో మంచి అవకాశమనీ చెబుతోంది. దేశ సేవ చేయాలనుకునే యువకులకు ఇదో మంచి అవకాశమనీ అంటోంది. విదేశాల్లోనూ అగ్నిపథ్ తరహా పథకం అమలవుతోందని అనవసరంగా ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని స్పష్టం చేస్తోంది. పైగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిలిపివేసేదే లేదని గట్టిగానే చెబుతోంది. అయితే ఈ తాత్కాలిక నియామకాల వల్ల శాశ్వత నియామకాలు తగ్గిపోతాయన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల నుంచి ఎంత మంది సైనికులు ఆర్మీలో చేరుతున్నారన్నదీ ఆసక్తికరంగా మారింది.
ఏయే రాష్ట్రాల నుంచి ఎంతంటే..
భారత జనాభాలో 2% వాటా ఉన్న పంజాబ్ నుంచి అత్యధికంగా ఆర్మీలో చేరుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2020 లెక్కల ప్రకారం మొత్తం రాష్ట్రాల వాటాని చూస్తే ఇది స్పష్టమవుతోంది. దేశ జనాభాలో 1% వాటా కలిగి ఉన్న హిమాచల్‌ప్రదేశ్..ఆర్మీకి దాదాపు 7% మంది యువకుల్ని అందిస్తోంది. జమ్ము, కశ్మీర్ సహా ఉత్తరాఖండ్ నుంచి 5%, బిహార్ నుంచి 6% మంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. తరవాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలూ ఉన్నాయి. దేశ సైన్యంలో చేరటాన్ని గర్వంగా ఫీల్ అవుతారు ఈ రాష్ట్రాల్లోని యువకులు. అందుకే మిగతా ఉద్యోగాలు కాదని మరీ సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆర్మీలో చేరాలనే లక్ష్యంతోనే చిన్నతనం నుంచే ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ పెడతారు.
రాష్ట్రం |
దేశ జనాభాలో వాటా |
ఆర్మీలో చేరుతున్న వారి శాతం (2020) |
బిహార్ |
9 |
6 |
హరియాణా |
2 |
6 |
హిమాచల్ ప్రదేశ్ |
1 |
7 |
జమ్ము, కశ్మీర్ |
1 |
5 |
మధ్యప్రదేశ్ |
6 |
4 |
మహారాష్ట్ర |
9 |
8 |
పంజాబ్ |
2 |
10 |
రాజస్థాన్ |
6 |
9 |
ఉత్తర్‌ప్రదేశ్ |
17 |
10 |
ఉత్తరాఖండ్ |
1 |
5 |
రాష్ట్రాల జనాభా
రాష్ట్రం |
2022 నాటికి జనాభా |
దేశ జనాభాలో వాటా (%)_ |
బిహార్ |
12,49,19,000 |
9 |
హరియాణా |
2,98,46,000 |
2 |
జమ్ము, కశ్మీర్ |
1,35,05,000 |
1 |
హిమాచల్‌ప్రదేశ్ |
74,31,000 |
1 |
మధ్యప్రదేశ్ |
8,55,48,000 |
6 |
మహారాష్ట్ర |
12,54,11,000 |
9 |
పంజాబ్ |
3,05,35,000 |
2 |
రాజస్థాన్ |
8,01,53,000 |
6 |
ఉత్తరప్రదేశ్ |
23,32,97,000 |
17 |
ఉత్తరాఖండ్ |
1,15,18,000 |
1 |
భారత్ |
1,37,29,89,959 |
|
అత్యధికంగా ఆర్మీని రిక్రూట్ చేేసుకునే రాష్ట్రాలు
రాష్ట్రం |
2017-18 |
2018-19 |
2019-20 |
ఆర్మీలో చేరుతున్న వారి శాతం (2020) |
బిహార్ |
2,726 |
2,199 |
4,559 |
6 |
హరియాణా |
3,634 |
3,210 |
5,097 |
6 |
హిమాచల్ ప్రదేశ్ |
2,376 |
4,202 |
5,882 |
7 |
జమ్ము కశ్మీర్ |
1,817 |
3,672 |
3,796 |
5 |
మధ్యప్రదేశ్ |
2,352 |
1,570 |
3,103 |
4 |
మహారాష్ట్ర |
3,836 |
4,050 |
6,131 |
8 |
పంజాబ్ |
4,988 |
5,843 |
7,813 |
10 |
రాజస్థాన్ |
4,298 |
4,172 |
6,887 |
9 |
ఉత్తరప్రదేశ్ |
6,339 |
6,322 |
8,425 |
10 |
ఉత్తరాఖండ్ |
2,384 |
3,222 |
4,366 |
5 |
భారత్ |
50,026 |
53,431 |
80,572 |
Also Read: Agnipath Scheme: అగ్నివీరులకు మరో ఆఫర్ ఇచ్చిన కేంద్రం, ఆ బలగాల్లో చేరే వారికి రిజర్వేషన్లు
Also Read: Agneepath Scheme: ఈ దేశాల్లోనూ అగ్నిపథ్ తరహా పథకం, అక్కడ ఎలా అమలు చేస్తున్నారో తెలుసా