అన్వేషించండి

Top Headlines Today: రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ ఫిక్స్, జీహెచ్ఎంసీలో కూల్చివేతల్లో హైడ్రా దూకుడు - నేటి టాప్ న్యూస్

Andhra Pradesh News | టీడీపీ మళ్లీ రాజ్యసభలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఇటు తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. జీహెచ్ఎంసీల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది.

హీరోయిన్ జత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి - ఆయన పాత్ర ఉందా ? ఇరికిస్తున్నారా ?
హీరోయిన్ కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు పెట్టించారని వస్తున్న ఆరోపణల విషయంలో కొంత మంది ఐపీఎస్ అధికారులు, పోలీసులతో పాటు జనగ్ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన దిశా నిర్దేశంలోనే అప్పటి ఐపీఎస్ అధికారులు ఈ పని చేశారన్న ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే సరైన సాక్ష్యాలు లేని రూ. ఐదు లక్షల చీటింగ్ కేసులో అరెస్టు కోసం ఐపీఎస్ ఆఫీసర్లను పంపరు. కానీ జెత్వానీని అరెస్టు చేసి తీసుకు  రావడానికి చాలా  పెద్ద టీమే వెళ్లింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ - రాజీనామా చేసిన వాళ్లకే చానిస్తారా ? కొత్త వాళ్లకిస్తారా ?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడూ లేదు. గత ఏప్రిల్‌లో చివరిగా కనకమేడల రవీంద్రకుమార్ పదవి కాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు. ఏపీకి ఉన్న  మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైసీపీ వాళ్లే ఉన్నారు. మళ్లీ 2026లోనే నాలుగు స్థానాలు ఖాళీ కావాల్సి ఉంది. అప్పుడు జరిగే ఎన్నికల్లో నాలుగు టీడీపీ కూటమికే దక్కుతాయి. కానీ అప్పటి వరకూ ఆగాల్సిన అవసరం లేకుండా ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

పనులు చేయిస్తారు ఫుడ్ పెట్టరు, సన్నబియ్యం అమ్మవార్లకు దొడ్డుబియ్యం పిల్లలకు
తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. పాలమాకుల గురుకుల పాఠశాలను బీఆర్‌ఎస్ నేతలతో కలిసి సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి జరుగుతున్న పరిణామాలు, చదువు, ఫుడ్‌, ఇతర సమస్యల గురించి తెలుసుకున్నారు. పాఠశాలలో సరైన ఫుడ్ పెట్టడం లేదని హరీష్‌రావు దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు, తమతోనే వంట చేయిస్తున్నారని సరైన వసతులు లేవని అడిగితే తిడుతున్నారని కొడుతున్నారని వాపోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఇమేజ్ పెంచుకుంటున్న రేవంత్ - ఇతర కాంగ్రెస్ సీనియర్లకు నచ్చడం లేదా ?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఏ మాత్రం తగ్గడం లేదు. దీనికి తాజా ఉదాహరణ యాదాద్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అని సంబోధించారు. అంతే కాదు తన నాలికపై మచ్చలు ఉన్నాయని తాను  చెప్పింది జరుగుతుందని కూడా అనేశారు. నిజంగా అంత నమ్మకం ఉంటే ఆయన తన సోదరుడు..మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునేవారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

నెల రోజులు విదేశాలకు వైఎస్ఆర్‌సీపీ అధినేత - వచ్చే సరికి పార్టీ ఖాళీ అయిపోతుందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జంపింగ్‌ల సీజన్ నడుస్తోంది. నిన్నామొన్నటి వరకూ తిరుగులేని పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నుంచి రోజుకు ఇద్దరు ముఖ్యనేతలు చొప్పున రాజీనామాలు చేస్తున్నారు. గురువారం ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా.. శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పని చేశారు.  తర్వాత ఎవరు అన్నదానిపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు జగన్ కోర్టు అనుమతి తీసుకుని విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Tirumala Stampede Conspiracy : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Tirumala Stampede Conspiracy : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
Embed widget