(Source: Poll of Polls)
Sajjala Ramakrishna Reddy : హీరోయిన్ జత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి - ఆయన పాత్ర ఉందా ? ఇరికిస్తున్నారా ?
Andhra Pradesh : హీరోయిన్ జత్వానీ కేసులో తన చుట్టూ కుట్ర జరుగుతోందని మాజీ సలహాదారు సజ్జల అనుమానిస్తున్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపారు.
Heroine Jatwani case : హీరోయిన్ కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు పెట్టించారని వస్తున్న ఆరోపణల విషయంలో కొంత మంది ఐపీఎస్ అధికారులు, పోలీసులతో పాటు జనగ్ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన దిశా నిర్దేశంలోనే అప్పటి ఐపీఎస్ అధికారులు ఈ పని చేశారన్న ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే సరైన సాక్ష్యాలు లేని రూ. ఐదు లక్షల చీటింగ్ కేసులో అరెస్టు కోసం ఐపీఎస్ ఆఫీసర్లను పంపరు. కానీ జెత్వానీని అరెస్టు చేసి తీసుకు రావడానికి చాలా పెద్ద టీమే వెళ్లింది. అది కూడా విమానాల్లో వెళ్లింది. ఆమె ఫిర్యాదు వస్తే కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చారు. నలభై రోజులకుపైగా జైల్లో ఉంచారు. ఈ కేసులో అనేక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటి సంగతి పక్కన పెడితే తనను కూడా ఈ కేసులోకి లాగుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా అనుమనిస్తున్నారు.
తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపిన సజ్జల
హీరోయిన్ జెత్వానీని ఏపీ ఐపీఎస్ అధికారులు వేధించినట్లుగా తెరపైకి వచ్చిన సమయంలో పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఓ పారిశ్రామిక వేత్త సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించారని.. దానికి కొంత విలువ కట్టి..తాను చూసుకుంటానని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకు అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్, డీసీపీ వంటి వారు .. రెక్కీ, కిడ్నాప్ వంటివి చేసి ఇక్కడ అరెస్టులు చూపించారని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య సలహాదారుగా ఉన్నప్పటికీ.. ఆయన పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని మొత్తం ఆయనే నడిపారన్న ఆరోపణలు గతంలోనే టీడీపీ చేసింది. ఈ క్రమలో సజ్జల ఆదేశాల వల్లే పోలీసులు ఈ పని చేశారని చెబుతున్నరాు. అయితే ఇలా చెప్పిన వారిపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడుతున్నారు. ఆయన .. ఓ ప్రముఖ పత్రికతో పాటు ఇవే ఆరోపణలు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్యకు కూడా నోటీసులు పంపారు.
వేధింపులపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన ముంబై నటి కాదంబరి జెత్వానీ
సజ్జలపై కుట్ర చేస్తున్నారన్న అంబటి రాంబాబు
మరో వైపు సజ్జల రామకృష్ణారెడ్డిని జత్వానీ కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. అందుకే ఆయన పేరును తరచూ ప్రస్తావన తెస్తున్నారని అంటున్నారు. అంబటి రాంబాబు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే.. ఈ కేసులో ఏదో జరుగుతోందని వారికి సమాచారం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే తనకే మాత్రం ప్రమేయం లేదని చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి లీగల్ నోీటీసులు ఇచ్చారని అంటున్నారు.
కాదంబరి జెత్వానీ కేసులో సజ్జలను ఇరికించే ప్రయత్నాలు - అంబటి కీలక వ్యాఖ్యలు
జత్వానీ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతోంది ?
హీరోయిన్ జత్వానీ కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం కనిప్తోంది. ఆమెను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు అసలు నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి. తప్పుడు కేసు పెట్టారని కూడా చెబుతున్నారు. జత్వాని ఎవరి దగ్గర అయితే రూ. ఐదు లక్షలు తీసుకున్నారని పోలీసులు కేసు పెట్టారో .. వారే తాము ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. ఆ స్థలాన్ని జత్వానీ తమకు అమ్మజూపలేదని స్పష్టం చేశారు. దీంతో .. అసలు ఈ కేసులో ఉన్న పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయింది.