అన్వేషించండి

TDP in Rajya Sabha : రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ - రాజీనామా చేసిన వాళ్లకే చానిస్తారా ? కొత్త వాళ్లకిస్తారా ?

Andhra Pradesh : తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ స్థానాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. రాజీనామా చేసిన వాళ్లకే చాన్సిస్తారా లేకపోతే కొత్త వారికా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Telugu Desam Party  to get Two Rajya Sabha seats : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడూ లేదు. గత ఏప్రిల్‌లో చివరిగా కనకమేడల రవీంద్రకుమార్ పదవి కాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు. ఏపీకి ఉన్న  మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైసీపీ వాళ్లే ఉన్నారు. మళ్లీ 2026లోనే నాలుగు స్థానాలు ఖాళీ కావాల్సి ఉంది. అప్పుడు జరిగే ఎన్నికల్లో నాలుగు టీడీపీ కూటమికే దక్కుతాయి. కానీ అప్పటి వరకూ ఆగాల్సిన అవసరం లేకుండా ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. వారిలో ఒకరు టీడీపీలో చేరిపోతానని ప్రకటించారు. మరొకరు ఏ పార్టీ అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇద్దరి రాజీనామాలు ఆమోదించడంతో ఖాళీ అయినట్లుగా ప్రకటించారు. 

ఉపఎన్నికల్లో రెండు సీట్లు కూటమికే

రాజ్యసభలో రెండు స్థానాలు ఖాళీ అయినట్లుగా ప్రకటించారు. త్వరలోనే ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉపఎన్నికల్లో రెండు చోట్ల  టీడీపీ కూటమికి ఏకగ్రీవం అవుతాయి. రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణా రావు టీడీపీలో చేరుతానని ప్రకటించారు. మరో ఎంపీ బీద మస్తాన్ రావు మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆయన మొదటి నుంచి టీడీపీ నేత. 2019లో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కూడా. తర్వాత వైసీపీలో చేరడంతో రాజ్యసభ సీటు దక్కింది. ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే టీడీపీలో చేరికపై స్పష్టత ఇవ్వలేదు. 

నెల రోజులు విదేశాలకు వైఎస్ఆర్‌సీపీ అధినేత - వచ్చే సరికి పార్టీ ఖాళీ అయిపోతుందా?

స్థానిక రాజకీయాల్లోనే ఉంటానంటున్న మోపిదేవి

రే్పల్లెకు చెందిన మోపిదేవి వెంకటరమణారావు స్థానిక రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇష్టం లేదని ఆయన అంటున్నారు. ఆ ప్రకారం చూస్తే ఆయన రాజ్యసభ పదవిని కూడా వదులుకున్నట్లే. ఈ పదవిని టీడీపీ అధినేత చంద్రబాబు  మరో సీనియర్ నేతకు కేటాయించే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజు లేదా యనమల రామకృష్ణుడుకు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఈ పదవి పదవీ కాలం మరో రెండేళ్లు కూడా లేదు. ఇప్పుడు పదవి దక్కించుకునేవారే అప్పుడు కూడా కంటిన్యూటీ పొందే అవకాశం ఉంది. 

విజయవాడ ఎంపీగా గెలిస్తే రాజకీయ భవిష్యత్ సమాధి - ఇప్పటి వరకూ జరిగింది ఇదే - ఇదిగో లిస్ట్

మళ్లీ రాజ్యసభకే బీద మస్తాన్ రావు

బీద మస్తాన్ రావు బీజేపీలో చేరితే ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉంది.  ఆయన పదవి కాలం 2028 వరకూ ఉంది. ఆ ఒప్పందంతోనే ఆయన వైసీపీకి.. రాజ్యసభకు రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఖాళీ అయిన రెండు సీట్లలో రెండూ టీడీపీ పోటీ చేస్తుందా.. ఒకటి బీజేపీకి కేటాయిస్తుందా అన్నదానిపై స్పష్టత రావాల్సి లఉంది. అందుకే ఆయన ఏ పార్టీలో చేరేది చెప్పలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా టీడీపీకి మళ్లీ రాజ్యసభలో ప్రాతినిధ్యం.. ఐదు నెలల వ్యవధిలోనే లభించబోతోంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
Seaplane In Andhra Pradesh: మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
Pawan Kalyan: పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
Seaplane In Andhra Pradesh: మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
Pawan Kalyan: పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
TG TET 2024: తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పరీక్షఎలా ఉంటుంది?
తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పరీక్షఎలా ఉంటుంది?
Nirmal District News: నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మహారాష్ట్ర దాటిందనుకుంటే కుంటాలలో ప్రత్యక్షం
నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మహారాష్ట్ర దాటిందనుకుంటే కుంటాలలో ప్రత్యక్షం  
Embed widget