Seema TDP : ప్రాజెక్టులపై జగన్ మౌనం ద్రోహమే ! సీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై టీడీపీ సదస్సులో కీలక తీర్మానాలు !
రాయలసీమ ప్రాజెక్టులపై అనంతపురంలో టీడీపీ సదస్సు నిర్వహించింది. సీమ ప్రాజెక్టును గెజిట్‌లో అక్రమ ప్రాజెక్టులుగా చెప్పిన జగన్ నోరు మెదపలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
రాయలసీమకు నీటి కరువును తీర్చే గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులకు అధికారికంగా నీటి కేటాయింపులు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అనంతపురంలో రాయలసీమ టీడీపీ నేతలందరూ సమావేశమయ్యారు. ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు ప్రత్యేకంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కీలకమైన తీర్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌లో గాలేరు నగరి, హాంద్రీనీవా ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే కేంద్రం ఇటీవల విడుదలు చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో వాటిని అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని సదస్సు తప్పు పట్టింది. Also Read : కేసీఆర్, జగన్ సై అంటే జల వివాదాలపై కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వం !
పార్లమెంట్ చేసిన చట్టానికి భిన్నంగా కేంద్ర జల సంఘం చేసిన సిఫార్సు రాయలసీమకు గొడ్డలి పెట్టులాంటిదని నేతలు మండిపడ్డారు. రాష్ట్రం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తక్షణం వాటిని అధికారిక ప్రాజెక్టులుగా ప్రకటించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గోదావరి నీటిని కృష్ణ డెల్టా అందించడం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమకు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయిన హాంద్రీనీవా ప్రాజెక్టు పనులను 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని...రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. Also Read : సాయి ధరమ్ తేజ్ గాయాలు ఎంత సీరియస్ ?
సదస్సులో కీలకమైన తీర్మానాలు చేశారు. హంద్రీనీవా,గాలేరు నగరి ప్రాజెక్ట్లులకు అధికారిక నీటి కేటాయింపులు, కేంద్ర గెజిట్‌లో వాటిని చేర్చడం, ట్టబద్ద నీటి హక్కులైన 144 టీఎంసీలు సీమకు దక్కేలాచేయడం. నీటి కేటాయింపులపై తెలంగాణ వాదనను తిప్పికొట్టడం. జీవో నెంబర్ 69 మేరకు శ్రీశైలంలో నిర్దేశించిన నీళ్ళు వున్నపుడే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసేలా చూడటం తీర్మానాల్లో కీలకమైనవి. Also Read : టీడీపీ సదస్సులు దండగన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ముఖ్యమంత్రి జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అది రాయలసీమ లిటిగేషన్ ప్రాజెక్ట్ అని మండిపడ్డారు. ఆ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతానికి పెద్ద ఉపయోగం ఉండదని ఇప్పటికే నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తపోతల పథకాన్ని కృష్ణా బోర్టులో అధికారికంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశానికి టీడీపీ రాయలసీమ నేతలంతా హాజరయ్యారు. సీఎం జగన్ కేవలం తమ రాజకీయ ప్రజలు, ఇతర అవసరాల కోసం ఏం జరిగినా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. సమావేశం ప్రారంభంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం కలకలం రేపింది. అయితే తర్వాత సదస్సు యథావిధిగా సాగింది. సదస్సు కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది.