అన్వేషించండి

Supreme Court: రాజకీయ ప్రసంగాలపై సుప్రీం ఫైర్ - విద్వేష ఉపన్యాసాలు ఆగినప్పుడే దేశాభివృద్ధని వెల్లడి!

Supreme Court: రాజకీయ నాయకులు విద్వేష ప్రసంగాలు ఆపినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. మత రాజకీయాలు ఓ విషవలయం అని వివరించింది. 

Supreme Court: రాజకీయ విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవడం ఆపినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. విద్వేష ప్రంసంగాలు ఓ విష వలయం అని.. రాజకీయాలను మతంలో కలపడం అనేక సమస్యలకు దారి తీస్తుందని వివరించింది. విచ్ఛిన్న శక్తులే ఇలాంటి పను చేస్తున్నాయని పేర్కొంది. ఇది ప్రజస్వామ్యానికి చాలా ప్రమాదం అని.. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఓ మార్గం చూడాలని ధర్మాసనం సూచించింది. ఇటీవలే తీర్పులోనూ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని నొక్కిచెప్పిందని న్యాయమూర్తులు కె.ఎం జోసెఫ్, బి.వి నాగరత్న ధర్మాసనం గుర్తు చేసింది. టీవీలు, పేపర్లు, సామాజిక మాధ్యమాల వేదికలపై ఇటీవల విద్వేష ప్రసంగాలు ఎక్కువయ్యయాని అభిప్రాయం వ్యకం చేశారు. మత విద్వేషకర వ్యాఖ్యలు చేస్తూ.. గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఎంతమందిపై అని కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టగలం..

ఇలాంటి విద్వేషకర వ్యాఖ్యలు చేసే ఎంత మందిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టగలమని ధర్మాసనం ప్రశ్నించింది. తోటి వారిపై, సామాజిక వర్గాలపై విద్వేష వ్యాఖ్యలు చేయబోమని ప్రజలు ప్రమాణం చేస్తే బాగుంటుందని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. దివంగత ప్రధానులు జవహార్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్ పేయి వంటి వారి ప్రసంగాలు ఎంతో హుందాగా ఉండేవని గుర్తు చేసింది. విద్వేష ప్రసంగాలపై త్వరగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోతున్నాటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే కోర్టులకు పని పడుతోందని వ్యాఖ్యానించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉంటే.. దానికి అర్థం ఏంటని ప్రశ్నించింది. రాష్ట్రాలు ఏమో కానీ కేంద్ర ప్రభుత్వానికి వర్తించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.

వీడియో క్లిప్ లు చూడాలని భావిస్తే పిటిషన్ లో చెప్పండి..

కేరళ, తమిళనాడుల్లో నేతల విద్వేష ప్రసంగాల ఉదంతాలను కూడా ఈ పిటిషన్ తో కలిపి విచారించాలని కోరారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్ ల ప్రదర్శనకు అనుమతించాలని కోరడంతో దీన్ని ఒక డ్రామాగా మార్చొద్దని ధర్మాసనం పేర్కొంది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందని సూచించింది. తాము వీడియో క్లిప్ లు చూడాలని పిటిషనర్లు భావిస్తే.. అదే విషయాన్ని పిటిషన్ లో చేర్చమని తెలిపింది. అలాగే విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RCB Postpone Title Celebrations: ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!
ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!
Bajaj Avenger Street 220 Launched: బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 కొత్త వెర్షన్ లాంచ్ - రెండు సరికొత్త కలర్ ఆప్షన్స్.. క్రూయిజర్ బైక్ లో అదిరిపోయే మార్పులు
బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 కొత్త వెర్షన్ లాంచ్ - రెండు సరికొత్త కలర్ ఆప్షన్స్.. క్రూయిజర్ బైక్ లో అదిరిపోయే మార్పులు
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget