Rohingya Refugee: రోహింగ్యాలకు ప్రత్యేక ఫ్లాట్‌లు, భద్రత - అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పిన కేంద్రం
Rohingya Refugee: దిల్లీలోని రోహింగ్యాలను ఫ్లాట్‌లలోకి తరలిస్తామన్న హర్ దీప్ సింగ్ పురి ప్రకటనను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఖండించింది.
Rohingya Refugee:
మంత్రి అలా, హోం మంత్రిత్వ శాఖ ఇలా..!
దిల్లీలోని బక్కర్‌వల ప్రాంతంలో రోహింగ్యాల కోసం ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్‌లు కడతామని, వారికి రక్షణ కూడా కల్పిస్తామని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి ప్రకటించిన కాసేపటికే...కేంద్రం ఈ ప్రకటనను ఖండించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..ఇలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని స్పష్టం చేసింది. "అక్రమంగా దేశంలోకి వచ్చిన వాళ్లను డిటెన్షన్ సెంటర్స్‌లోనే ఉంచుతాం. వారు మన దేశం వదిలి వెళ్లేంత వరకూ ఆ కేంద్రాల్లోనే ఉంటారు" అని వెల్లడించింది. అంతే కాదు. ప్రస్తుతం బక్కర్‌వల ప్రాంతంలో ఉన్న శరణార్థుల్ని వేరే ప్రాంతానికి తరలించాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ప్రాంతాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించకూడదని తేల్చి చెప్పింది. టెంట్‌లలో నివసిస్తున్న 1100 మంది రోహింగ్యా శరణార్థులను అపార్ట్‌మెంట్లలోకి తరలిస్తామని, వారికి రౌండ్ ది క్లాక్ భద్రత కూడా కల్పిస్తామని హర్‌దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. కానీ హోం మంత్రిత్వ శాఖ ప్రకటన ఇందుకు భిన్నంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది.
Those who made a career out of spreading canards on India’s refugee policy deliberately linking it to #CAA will be disappointed.
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 17, 2022
India respects & follows @UN Refugee Convention 1951 & provides refuge to all, regardless of their race, religion or creed.@MIB_India @NBirenSingh pic.twitter.com/6jyMl9dJ7Q
With respect to news reports in certain sections of media regarding Rohingya illegal foreigners, it is clarified that Ministry of Home Affairs (MHA) has not given any directions to provide EWS flats to Rohingya illegal migrants at Bakkarwala in New Delhi.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) August 17, 2022
Illegal foreigners are to be kept in Detention Centre till their deportation as per law. The Government of Delhi has not declared the present location as a Detention Centre. They have been directed to do the same immediately.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) August 17, 2022
Also Read: వారే లేకపోతే కశ్మీర్ పాక్ వశమయ్యేది - త్వరలో ‘ఆర్ఎస్ఎస్’పై సినిమా, వెబ్ సీరిస్: విజయేంద్ర ప్రసాద్
Also Read: Prabhas: 'కార్తికేయ2' సినిమాపై ప్రభాస్ రియాక్షన్ - పోస్ట్ వైరల్!